ఇటీవల వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు ఎక్కువైపోతున్నాయి.మరణం ఎప్పుడు ఎవరిని ఎలా.
తీసుకెళ్లి పోతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది.సామాన్య ప్రజలతోపాటు సెలబ్రిటీల సైతం హార్ట్ ఎటాక్ కీ గురై మరణిస్తున్నారు.
ఒకప్పుడు వయసు మీద పడినవారు ఎక్కువగా గుండెపోటుకు గురై చనిపోయే వాళ్ళు.కానీ ఇప్పుడు పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు కూడా గుండెపోటుకు గురి కావటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
తాజాగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న మరీదు రాకేష్ (18) అనే విద్యార్థి గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు.స్నేహితులతో ఇంటి ఆవరణలో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు.
వెంటనే దగ్గరలో మధిర ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యలోనే చనిపోవడం జరిగింది.వైద్యులు గుండెపోటు కారణంగా మరణించినట్లు నిర్ధారించారు.
దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.ఇంత చిన్న వయసులోనే గుండెపోటు రావడంతో స్థానికులు ఒక్కసారిగా షాక్ కీ గురవుతున్నారు.
రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి గుండెపోటుకు గురై మరణించాడు.కాగా నేడు ఖమ్మంలో ఇంటర్ సెకండియర్ విద్యార్థి గుండెపోటుకు గురై మరణించడం పట్ల చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.







