రాజ్ తో అందుకే విడిపోయా.. బ్రతిమాలినా వినలేదు.. కోటి షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో కోటి ఒకరు కాగా కోటి మ్యూజిక్ ను అభిమానించే అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది.ఈయన పూర్తి పేరు సాలూరి కోటేశ్వరరావు కాగా ఇండస్ట్రీలో కోటి అనే పేరుతో ఈయన పాపులర్ అయ్యారు.

 Koti Sensational Comments About Music Director Raj Details, Koti, Music Director-TeluguStop.com

మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను కోటి ఖాతాలో వేసుకున్నారు.కెరీర్ తొలినాళ్లలో కోటి చక్రవర్తి దగ్గర సహాయకునిగా పని చేయడం గమనార్హం.

రాజ్, కోటి ఇద్దరూ కలిసి పెరగగా మొదట రాజ్ కు మూవీ ఆఫర్ వచ్చింది.అయితే అప్పటినుంచి రాజ్ కోటి కలిసి సినిమాల కోసం పని చేయాలని అనుకున్నారు.

ప్రళయ గర్జన అనే సినిమాతో రాజ్ కోటి ప్రయాణం మొదలైంది.తొలి సినిమాతోనే వీళ్లిద్దరూ సంగీత దర్శకులుగా మంచి మార్కులు వేయించుకున్నారు.

యముడికి మొగుడు సినిమాకు మ్యూజిక్ అందించడంతో రాజ్ కోటి దశ తిరిగింది.

యముడికి మొగుడు మూవీ కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు వీళ్లిద్దరి మ్యూజిక్ కు మంచి మార్కులు పడ్డాయి.మేమిద్దరం కలిసి సాంగ్స్, రీ రికార్డింగ్ కోసం పని చేసే వాళ్లమని కోటి చెప్పుకొచ్చారు.ఇది నా పాట ఇది నీ పాట అనేది లేదని కోటి తెలిపారు.

ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ తో కొనసాగించమని ఆయన పేర్కొన్నారు.విడిపోయిన తర్వాత నేను చేసింది నేనే చేశానని చెబుతానని కోటి పేర్కొన్నారు.

బ్యాడ్ టైమ్ వల్ల మేము విడిపోయామని కాల ప్రభావం అని కోటి వెల్లడించారు.హీరోలు, డైరెక్టర్లు నాకు ఎక్కువ విలువ ఇవ్వడంతో కొంతమంది రాజ్ ను డైవర్ట్ చేశారని ఆయన తెలిపారు.రాజ్ వల్లే నేను విడిపోయానని కోటి ఆన్నారు.నేను ఎంతో బ్రతిమాలినా రాజ్ వినలేదని కోటి తెలిపారు.ఎవరిదీ తప్పని చెప్పలేమని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube