ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి చెప్పిన విషయాలలో అన్ని విషయాలు కాకపోయినా మెజారిటీ విషయాలు రైట్ అవుతాయనే సంగతి తెలిసిందే.సినిమా రంగానికి చెందిన చాలామంది సెలబ్రిటీలు సైతం వేణుస్వామి చెప్పే జాతకాలను నమ్మడంతో పాటు ఆయన చెప్పింది నిజమవుతుందని భావిస్తారు.
తాజాగా వేణుస్వామి ఒక ఇంటర్వ్యూలో అమ్మాయిల గురించి చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
లెవెల్ పెరిగే కొద్దీ మెంటల్ టెన్షన్ వస్తుందని లెగసీని కంటిన్యూ చేయడం సులువు కాదని ఆయన అన్నారు.
సక్సెస్ రేట్ ను కచ్చితంగా చూపించాలని వేణుస్వామి తెలిపారు.ఆడవాళ్లు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నారని గతంలో ఆడవాళ్లు 80 శాతం ఇంటికి 20 శాతం పిల్లల కోసం తెలివిని వాడేవారని ఆయన కామెంట్లు చేశారు.
ప్రస్తుతం ఆడవాళ్లు 80 శాతం ఉద్యోగాలకే సమయం కేటాయిస్తున్నారని వేణుస్వామి అన్నారు.

ప్రస్తుతం అమ్మాయిలను తిట్టడం ఫ్యాషన్ అయిపోయిందని అలా తిట్టేవాళ్లను చెప్పుతో కొట్టాలని ఎందుకంటే ఆడవాళ్లకు మెన్షువల్ పీరియడ్ కోసం నాలుగురోజుల సెలవులు ఇచ్చారని ఆ సమయంలో వాళ్లు కంఫర్టబుల్ జోన్ లో ఉండరని ఆయన తెలిపారు.అందువల్ల పెద్దలు నాలుగు రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారని ఆ ఆచారాన్ని ఇప్పుడు భ్రష్టు పట్టించారని వేణుస్వామి కామెంట్లు చేశారు.

ఆ సమయంలో అమ్మాయిలు డిప్రెషన్ కు గురవుతారని అప్పుడు అబ్బాయిల నుంచి సపోర్ట్ ఉండాలని వేణుస్వామి అన్నారు.నేను అమ్మాయిలను చూసే విధానం డిఫరెంట్ అని ఆయన తెలిపారు.అమ్మాయిలు ఎవరూ కావాలని తప్పు చేయరని వేణుస్వామి పేర్కొన్నారు.
మనం ఏమైనా నిందించాలంటే సమాజాన్ని నిందించాలని వేణుస్వామి చెప్పుకొచ్చారు.ఈ రీజన్స్ వల్లే విడాకులు పెరుగుతున్నాయని ఆయన కామెంట్లు చేశారు.
అమ్మాయిల వ్యక్తిగత సమస్యలను అర్థం చేసుకుంటే విడాకులు ఉండవని ఆయన తెలిపారు.భార్యాభర్తలు 12 గంటల కంటే ఎక్కువ సమయం ఇంట్లో కలిసి ఉంటే సమస్యలు పెరుగుతాయని ఆయన తెలిపారు.







