కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రసంగంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల పట్ల బిజెపి మండిపడుతుంది .ఇటీవల కేంద్ర యూనివర్సిటీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు .
నా ఫోన్లో పెగాసస్ ఉంది ప్రజల డేటాను ప్రభుత్వం రికార్డు చేస్తుంది, మీడియా, న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని విమర్శించారు .ఈ వ్యాఖ్యల పట్ల బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.రాహుల్ గాంధీ దేశం పరువు విదేశాల్లో తీస్తున్నారని విమర్శించింది .లండన్ లోని జర్నలిస్ట్ అసోసియేషన్ మీటింగ్లో పాల్గొన్న రాహుల్ గాంధీఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు ప్రధాని మోడీపై ఎవరైనా విమర్శ చేస్తే వారిపై దాడి జరుగుతుంది.
విదేశాల్లో భారత పరువు తీస్తున్నది నేను కాదని మోడీ తన చివరి విదేశీ పర్యటనలో మాట్లాడిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయని 70 సంవత్సరాల భారత ప్రజాస్వామ్యంలో అభివృద్ధి జరగలేదని అవినీతి మాత్రమే జరిగిందని ఆయన విమర్శించారని గుర్తు చేశారు 70 సంవత్సరాలలో ఏమీ జరగలేదని ఆయన ఎలా అనగలరు? ఇది భారత ప్రజాస్వామ్యాన్ని భారత ప్రజలను అవమానించినట్లు కాదా ? అని ఆయన ప్రశ్నించారు నేనెప్పుడూ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవాన్ని తగ్గించే వ్యాఖ్యలు చేయనని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఇటీవల బిజెపి నాయకులు చేసిన అనేక వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని, దీనిపై దేశ విదేశాల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించిందని భారత్ పట్ల అంతర్జాతీయ సమాజంలో హిందూ దేశం అనే ముద్ర పడుతుందని మరి దేశం పరువు తీస్తున్నది నేనా? వాళ్ళా? ఆలోచించాలని రాహుల్ గాంధీ తెలిపారు మైనారిటీ హక్కుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.ప్రజాస్వామ్యంలో విమర్శ అన్నది సాధారణమని, విమర్శలను తీసుకోలేని అసహనం బిజెపిలో కనిపిస్తుందని, నిలదీసిన వారి ఇళ్లను బుల్లోజర్లతో పడగొట్టి మాది బుల్డోజర్ ప్రభుత్వమని బిజెపి నిరూపించుకుంటుందని రాహుల్ గాంధీ ఆరోపించారు.మతతత్వ రాజకీయాలు చేయటం ఇప్పటికైనా మానుకోవాలని, లౌకికదేశంలో అందరికీ సమాన అవకాశాలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.