సాధారణంగా హీరోలు వారు చేసే సినిమాలుకు తగ్గట్టుగా వారి హెయిర్ స్టైల్ బాడీ విధానాన్ని అందుకు అనుగుణంగా మలుచుకుంటూ ఉంటారు.సినిమాలో సిక్స్ ప్యాక్ లో కనిపించాలి అంటే జిమ్ లో కష్టపడి సిక్స్ ప్యాక్ ని తెచ్చుకుంటూ ఉంటారు.
అయితే హీరోల సిక్స్ ప్యాక్ వెనుక ఎంతో కష్టం ఉంటుంది అన్న విషయం తెలిసిందే.హీరోలు కండలం పెంచడం వెనుక వారి ట్రైనర్లు కూడా ఉన్నారని చెప్పవచ్చు.
కొందరు వారి ట్రైనర్లను పరిచయం చేస్తే మరి కొందరు మాత్రం పరిచయం చేయడానికి అంతగా ఆసక్తిని చూపించరు.

కాని బాలీవుడ్ స్టార్ హిరో హృతిక్ మాత్రం తనకోసం కష్టపడ్డ తన ట్రైనర్ ను ప్రపంచానికి పరిచయం చేస్తూ అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు.హృతిక్ రోషన్ నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్. ఈ సినిమా కోసం ప్రస్తుతం జిమ్లో కష్టపడుతూ చెమటలు చిందిస్తున్నాడు.
తన తదుపరి సినిమా కోసం తన శరీరాన్ని ఫైటర్ కోసం రెడీ చేసే పనిలో ఉన్నాడు హృతిక్.ఫిట్‌నెస్ పై మరింత దృష్టిని పెట్టాడు.ఈ విషయం మరోసారి ప్రత్యేకమైన చర్చకు దారి తీసింది.అందుకు కారణం ఆయన జిమ్ ట్రైనర్.
హృతిక్ రోషన్ కు ట్రైనింగ్ ఇచ్చిన జిమ్ ట్రైనర్ క్రిస్ గెతిన్ తిరిగి తన సొంత దేశానికి వెళ్లిపోతున్నాడు.

ఈ క్రమంలో ఆయనని ఉద్దేశించి హృతిక్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.పని పట్ల శ్రద్ధ, నిబద్దత కలిగిన మీ లాంటి వారిని చూస్తుంటే గొప్పగా అనిపిస్తుంది.నిజానికి ప్రపంచానికి మీ లాంటి వారే కావాలి, మీకోసం ఎదురుచూస్తుంటాను అంటూ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేశారు హృతిక్ రోషన్.
ఆ పోస్ట్ పై స్పందించిన హృతిక్ రోషన్ జిమ్ ట్రైనర్ ది ఫైటర్ అంటూ రిప్లై ఇచ్చాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఫైటర్ లో హృతిక్ జోడీగా దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది.







