ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇటీవల అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా సీబీఐ కస్టడీ పొడిగింపు అయింది.సిసోడియాకు మరో రెండు రోజులపాటు సీబీఐ కస్టడీని పొడిగిస్తున్నట్లు కోర్టు తెలిపింది.
కేసు దర్యాప్తునకు సిసోడియా సహకరించడం లేదని సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది.ఈ క్రమంలోనే మరో మూడు రోజులపాటు కస్టడీ పెంచాలని కోరింది.
సీబీఐ వాదనలతో ఏకీభవించిన ఎంకే నాగ్ పాల్ ధర్మాసనం కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
మరోవైపు సిసోడియాను సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించారు అధికారులు.కోర్టు ఆదేశాల నేపథ్యంలో 24 గంటలకు ఒకసారి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.







