కష్ట సమయంలో సమంత నాకు అండగా నిలిచింది.. చిన్మయి పోస్ట్ వైరల్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉంటుందనే విషయం మనకు తెలిసిందే.ఇలా సెలబ్రిటీల మధ్య ఉన్న స్నేహం కారణంగా వారు ఏదైనా కష్ట సమయాలలో ఉంటే వారికి ఎంతో అండగా నిలిచి వారిలో ఎంతో మనోధైర్యాన్ని నింపుతూ మేమున్నాము అనే భరోసా కల్పిస్తూ ఉంటారు.

 Samantha Stood By Me During Difficult Times Singer Chinmayi Post Viral Details,-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులుగా ఉన్నటువంటి వారిలో సింగర్ చిన్మయి నటి సమంత కూడా ఒకరని చెప్పాలి.సినిమా ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్టుగా,సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిన్మయి గురించి అందరికీ సుపరిచితమే.

ఇక చిన్మయి ఎక్కువగా సమంత నటించిన సినిమాలకు డబ్బింగ్ చెప్పడంతో వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది.అయితే ప్రస్తుతం సమంత తన సినిమాలకు తానే డబ్బింగ్ చెబుతూ ఉన్నారు.

ఇక సమంత తాజాగా మాయోసైటిసిస్ వ్యాధి బారిన పడ్డారు.ఈ వ్యాధి బారిన పడిన ఈమెకు ఎంతోమంది అండగా నిలిచి ధైర్యం చెప్పారు.

అలాగే నాగచైతన్యతో విడిపోయిన సమయంలో కూడా చిన్మయి ఆమె భర్త రాహుల్ రవీంద్ర కూడా సమంతకు మద్దతుగా నిలబడి తనలో ధైర్యాన్ని నింపారు.

Telugu Samantha, Chinmayi, Vairamuthu-Movie

ఇలా సమంతకు ప్రతి క్షణం అండగా నిలిచినటువంటి చిన్మయి తాజాగా సమంత తనుకు చేసిన సహాయం గురించి తన కష్టకాలంలో తనకు అండగా నిలిచిన క్షణాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.సింగర్ చిన్మయి గతంలో మీటూ ఉద్యమం ద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే.సీనియర్ రచయిత వైరముత్తు పై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.అయితే ఆ సమయంలో చాలామంది చిన్మయికి కాకుండా వైరముత్తుకు మద్దతుగా నిలవడమే కాకుండా చిన్మయిని బ్యాన్ చేయాలంటూ

Telugu Samantha, Chinmayi, Vairamuthu-Movie

తనకు కనీసం అవకాశాలు కూడా రాకుండా చేశారు.అయితే ఈ విషయంపై స్పందించిన చిన్మయి తనకు అవకాశాలు రాకుండా చేసిన సమయంలో పని లేక తాను ఎన్నో ఇబ్బందులు పడ్డాను.ఆ సమయంలో సమంత తన సినిమాలకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్ని కల్పించి తనకు పని కల్పించి కష్ట సమయంలో ఎంతో అండగా నిలిచారని, నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచినది సమంత మాత్రమే అంటూ ఈ సందర్భంగా చిన్మయి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube