ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఈవెంట్లలో, అవార్డుల ఫంక్షన్ లో అలాగే ఎక్కడ ఏం మాట్లాడాలి అన్న ఎలా ప్రవర్తించాలి అన్న కూడా కాస్త భయపడుతున్నారని చెప్పవచ్చు.ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ నెటిజన్స్ ఆ విషయాన్ని హల్చల్ చేస్తూ వారిపై ట్రోల్లింగ్ చేస్తున్నారు.
ఏ చిన్న తప్పు చేసిన సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ వారిపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.తాజాగా ఒక నటి చేసిన పనికి నెటిజన్స్ మండిపడడంతో పాటు ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు.
తాజాగా, ప్రముఖ బాలీవుడ్ నటి భూమీ పడ్నేకర్ వివాదంలో చిక్కుకుంది.

అసలేం జరిగిందంటే.తాజాగా భూమి పడ్నేకర్ ఒక కార్యక్రమానికి వెళ్లగా అక్కడ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన జరిగింది.దీపం కుందె ఉన్న స్టేజిమీదకు అతిధులంతా ఎక్కారు.
వారిలో భూమీ పడ్నేకర్ కూడా ఉన్నారు.ఈ నేపథ్యంలోనే దీపపు కుందె దగ్గరకు రావాలని కొంతమంది ఆమెకు చెప్పారు.
దీంతో భూమీ పడ్నేకర్ చెప్పులు విడవటానికి ప్రయత్నించింది.కానీ వాటిని తీయటం ఆమె వల్ల కాలేదు.
దాంతో ఆమె స్టేజి మీద నుంచి కిందకు దిగి చెప్పులు తీసే ప్రయత్నం చేస్తూ ఉండగా అవి టైట్ గా ఉండటం వల్ల రాలేదు.అప్పుడు ఆమె అసిస్టెంట్ ఆమెకు సహాయం చేశాడు.

తర్వాత ఆమె దీపపు కుందె దగ్గరకు వెళ్లిపోయారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అసిస్టెంట్‌తో ఆమె చెప్పులు తీయించుకోవటాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.భూమీ చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.కానీ ఇంకొందరు మాత్రం ఆమెను సమర్థిస్తున్నారు.అక్కడ ఆమె అడగలేదు కదా అసిస్టెంట్ వెళ్లి ఆమెకు సహాయం చేశారు అటువంటి అప్పుడు అందులో తప్పేం కనిపించింది అని సపోర్ట్ గా మాట్లాడుతున్నారు.
కొందరు మాత్రం ఆమెపై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.







