విలేకర్లతో వ్యంగంగా స్పందించిన నటుడు.. మా బెడ్ రూమ్ లోకి వచ్చేయండి అంటూ?

సాధారణంగా బయట సెలబ్రిటీలు కనిపిస్తే వారికి ఫోటోస్ తీయడం వీడియోలు తీయడం లాంటివి చేస్తూ ఉంటారు.కొంతమంది ఎగబడుతూ సెల్ఫీలు దిగుతూ సెలబ్రిటీల మీదకు వెళుతుంటారు.

 Saif Ali Khan To Paparazzi Following Him And Kareena Kapoor To Their Home,saif A-TeluguStop.com

కొన్ని కొన్ని సార్లు సెలబ్రిటీలు అసహనానికి లోనవుతూ ఉంటారు.వెంటనే కొంతమంది సెలబ్రిటీలు కోపాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు.

తాజాగా అలాంటి సంఘటనే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కు ఎదురయింది.దాంతో ఫోటోగ్రాఫర్లకు సైఫ్ అలీ ఖాన్ చురకలు అంటించాడు.

తాజాగా సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనాతో కలిసి ఓ సెలబ్రిటీ బర్త్‌డే పార్టీలో సందడి చేశారు.

పార్టీ నుంచి వస్తున్న సమయంలో పలువురు విలేకర్లు సైఫ్ అలీ ఖాన్ కరీనా జంట ఫోటోలను క్లిక్‌మనిపించేందుకు ఆసక్తి కనబర్చారు.వారి ప్రవర్తనతో కాస్త అసహనానికి గురైన సైఫ్‌.ఒకపని చేయండి.

మా బెడ్‌రూమ్‌లోకి కూడా రండి అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

అయితే ఈ వీడియో పై స్పందించిన పలువురు నెటిజెన్స్ అలా వ్యయంగా స్పందించడం సరైన పద్ధతి కాదు అని కొందరు కామెంట్స్ చేస్తుండగా, సెలబ్రిటీలను విసిగించకూడదు.

వారికి ఇబ్బంది గానే ఉంటుంది కదా అంటూ సైఫ్ అలీ ఖాన్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.కాగా మొన్నటికి మొన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ ఆమె ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆపోజిట్ అపార్ట్మెంట్ పైనుంచి ఫోటోలు తీసిన విషయం తెలిసిందే.ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ మండిపడింది.

ఏ విషయం కైనా కూడా ఒక హద్దు ఉంటుందని దాన్ని వాళ్ళు మితిమీరి ప్రవర్తించారు అంటూ ఆమె ఆగ్రహానికి లోనయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube