ఇందు “కేసు వైవి సుబ్బారెడ్డి మెడకు చుట్టుకొనుందా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇందు గృహ నిర్మాణ మండలి ప్రాజెక్టు కింద వసంత ప్రాజెక్టుకు జరిగిన కేటాయింపుల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఇందులో వైయస్ రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు వైవి సుబ్బారెడ్డి పాత్ర కూడా ఉన్నదని సిబిఐ తెలంగాణ హైకోర్టుకు నివేదించింది.అర్హత లేని వసంత ప్రాజెక్టుకు ఉద్దేశపూర్వకంగా కేటాయింపులు చేశారని, వై వి సుబ్బారెడ్డి ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీకి కేటాయింపులు పెరిగాయని ఇందులో కుట్ర కోణం కచ్చితంగా ఉందఉందని సిబిఐ తరపు న్యాయవాది వాదించారు.జగన్ అక్రమ కేసుల వ్యవహారాల్లో భాగంగా వేసిన ఈ కేసును కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్ కి జస్టిస్ఉజ్జల్ భూయన్ నేతృత్వం లో జరిగిన విచారణలో భాగంగా

 Yv Subba Reddy Indu Projects Case Cbi Investigation Details , Yv Subba Reddy ,in-TeluguStop.com
Telugu Cbi, Cmjagan, Indu Projects, Ujjal Bhayan, Yv Subba Reddy, Yvsubba-Telugu

వై.వి సుబ్బారెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ కేసులో విచారణ చేయాలంటే డిమాండ్ ఉండాలని ముడుపులు ఇవ్వటం మరియు తీసుకోవటం అనే కార్యక్రమం ఏమి ఇందులో జరగలేదని,ఇందుకు ఒక సాక్ష్యం కూడా లేదని కోర్టుకు తెలిపారు కేవలం ఒక పార్ట్నర్ బయటకు వెళ్తుంటే ఆ వాటాను వైవి సుబ్బారెడ్డి గారు తీసుకున్నారని ఇది అన్ని కంపెనీల్లో జరిగే మామూలు పద్ధతేనని అందువల్ల ఈ కేసును కొట్టివేయాలనిని వాదించారు అయితే సిబిఐ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ

Telugu Cbi, Cmjagan, Indu Projects, Ujjal Bhayan, Yv Subba Reddy, Yvsubba-Telugu

వై.వి సుబ్బారెడ్డి పార్టనర్ గా జాయిన్ అయిన తర్వాత దానికి జరిగిన కేటాయింపులు నిష్పక్షపాతంగా లేవని, ఆ హిందూ ప్రాజెక్ట్ భాగస్వామ్యంలో నిర్మితమైన విల్లాలను ఫ్లాట్లన్నీవై.వి సుబ్బారెడ్డి బంధువుల పేరుతో రిజిస్టర్ అయ్యాయని అందువల్ల ఇందులో ఉన్న కుట్ర కోణాన్ని కోర్టు పరిగణ లోకి తీసుకోవాలని వాదించారు .ఏది ఏమైనప్పటికీ బేతాళ విక్రమార్క కేసు లాగా జగన్ మెడకు ను చుట్టుకుని గత కొన్ని సంవత్సరాలుగా రకరకాల మెలికలు తిరుగుతున్న ఈ అక్రమాస్తుల కేసు చివరకు వై వి సుబ్బారెడ్డి మెడకు చుట్టుకుంటున్నట్లుగా తెలుస్తుంది .మరి ఈ కేసులో నుంచి ఆయన ఏ విధంగా బయటపడతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube