ఏపీ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.ఏపీ ప్రభుత్వం విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023కు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.దేశంలోని ముఖ్యమైన రాష్ట్రాల్లో ఏపీ ఒకటని పేర్కొన్నారు.
రాష్ట్రంలో జాతీయ రహదారులను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.రాష్ట్రంలో రోడ్ల అనుసంధానం కోసం రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.పోర్టులతో రహదారుల కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తామన్న గడ్కరీ.
పారిశ్రమిక అభివృద్ధిలో రహదారుల కనెక్టివిటీ ఎంతో ముఖ్యమైన అంశమని స్పష్టం చేశారు.మోదీ పాలనలో రోడ్ల అభివృద్ధి వేగం పుంజుకుందని పేర్కొన్నారు.
తిరుపతిలో ఇంట్రా మోడల్ బస్ పోర్టు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.ఏపీలో 3 పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయని వెల్లడించారు.
సరకు రవాణా ఖర్చులు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు గడ్కరీ పేర్కొన్నారు.పరిశ్రమలకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా ఏపీలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వంతో సమాన భాగస్వామ్యంతో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు ఉంటుందని ప్రకటించారు.








