విదేశీ పౌరులకు కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది.సందర్శకులుగా తమ దేశానికి వచ్చిన విదేశీయులు.
.చెల్లుబాటయ్యే జాబ్ ఆఫర్‌ను పొందినట్లయితే అట్టివారు దేశం విడిచి వెళ్లకుండానే వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) ప్రకటించింది.
ఈ మేరకు గురువారంతో ముగిసిన ‘‘కోవిడ్ ఎరా టెంపరరీ పబ్లిక్ పాలసీ’’ని ఫిబ్రవరి 28, 2025 వరకు రెండేళ్లపాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది.ఈ విధానాన్ని కొనసాగించడం వల్ల కెనడాలోని యజమానులకు సందర్శకులు ఒక ఎంపికగా మారారని ఐఆర్‌సీసీ తెలిపింది.

ఇది అందుబాటులోకి రావడానికి ముందు కెనడాలో పనిచేయడానికి దరఖాస్తు చేసుకునేవారు , అక్కడికి వెళ్లేముందే వర్క్ పర్మిట్ కోసం అప్లయ్ చేసుకోవాలి.అయితే వర్క్ పర్మిట్ దరఖాస్తు ఆమోదించబడి, అప్పటికే సందర్శకుల హోదాతో కెనడాలో వున్నట్లయితే.అట్టి వారికి వర్క్ పర్మిట్ రావాలంటే దేశం విడిచి వెళ్లాల్సి వుంటుంది.అయితే కెనడా ప్రభుత్వం ‘‘కోవిడ్ ఎరా టెంపరరీ పబ్లిక్ పాలసీ’’ని అమల్లోకి తీసుకురావడంతో సందర్శకులు దేశాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు.
ఈ పాలసీ నుంచి ప్రయోజనం పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకున్న రోజున సందర్శకుడిగా కెనడాలో చెల్లుబాటయ్యే స్థితిని కలిగి వుండాలి.అలాగే లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఎల్ఎంఐఏ) లేదా, ఎల్ఎంఐఏ ఎగ్జంప్ట్ ఆఫర్ లెటర్ పొంది వుండాలి.

ఎల్ఎంఐఏ అనేది ఎంప్లాయ్‌మెంట్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ కెనడా (ఈఎస్‌డీసీ)లోని ఒక భాగం.ఇది విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం వల్ల కెనడా ఆర్ధిక వ్యవస్థపై సానుకూల, తటస్థ లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందా లేదా అని అంచనా వేసే ఒక అప్లికేషన్.ఈఎస్‌డీసీ ప్రభావం ప్రతికూలంగా వుందని భావించినట్లయితే ,సదరు యజమాని విదేశీ పౌరులను నియమించుకోవడానికి అర్హులు కాదు.పాలసీ ప్రకారం.దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఎంప్లయర్ స్పెసిఫిక్ వర్క్ పర్మిట్ కోసం ఫిబ్రవరి 28, 2025 తర్వాత తప్పనిసరిగా దరఖాస్తును సమర్పించాలి.







