మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు.ఈయన మెగా ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సంపాదించు కున్నాడు.
ముందు నుండి వరుణ్ తేజ్ డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు.ఈయన సినిమా వస్తుంది అంటే ఏదొక కొత్తదనం ఉంటుంది అని ఫ్యాన్స్ సైతం ఎదురు చూస్తున్నారు.
ప్రెజెంట్ వరుణ్ తేజ్ క్రేజీ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు.మరి ఆ సినిమాల్లో వరుణ్ తేజ్ 13వ సినిమా ఒకటి.ఈ సినిమా కూడా భిన్నంగా ఉండనుంది.నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా ఈ సినిమాను నూతన డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు.
భారత వాయుదళ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది.

ఈ సినిమా కొద్దీ రోజుల క్రితమే ప్రకటించగా త్వరలోనే షూట్ స్టార్ట్ కానుంది.‘VT13’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి తాజాగా మేకర్స్ హీరోయిన్ ను ప్రకటించారు.ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జంటగా మిస్ యూనివర్స్ ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తుంది అని మేకర్స్ కొద్దీ సేపటి క్రితం అఫిషియల్ గా ప్రకటించారు.

అంతేకాదు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను కూడా రిలీజ్ చేయగా ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.మానుషీ చిల్లర్ ను ఇంట్రడ్యూస్ చేసిన విధానం ఆకట్టుకుంది.ఇక పాన్ ఇండియన్ వ్యాప్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ అండ్ రెనైస్సేన్స్ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
చూడాలి ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో.







