పల్లెటూళ్లలో నివసించేవారికి ఉడుము గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆంగ్లంలో మానిటర్ లిజార్డ్ అని పిలిచే ఇవి దేన్నైనా గట్టిగా పట్టుకున్నాయంటే ఇక విడిపించడం దాదాపు అసాధ్యం.
అందుకే మనలో ఎవరన్నా అనుకున్న పని ఎంత కష్టమైనా సరే వదలకుండా చేస్తే వారిని “ఏం ఉడుంపట్టురా బాబు!” అని అంటుంటారు.అలాగే కుస్తీ పోటీలలో ప్రత్యర్థులను తమ బాహుబలంతో మట్టికరిపించేవారిని కూడా “ఏం పట్టాడురా… ఉడుం పట్టు!” అని అంటూ వుంటారు.
అలా ఈ నానుడి వాడుకలోకి వచ్చింది.

అలాంటి ఉడుము మరొక ఉడుముతో కలసి ఓ పట్టుబడితే ఎలా ఉంటుంది? మనుషుల్లాగా ఎదురెదురుగా నిలబడి కుస్తీ పోటీలో పోట్లాడుకుంటున్నట్టే పోట్లాడుకుంటే ఎలా ఉంటుంది? చూడడానికి ఎగబడతాం కదా.తాజాగా అలాంటి ఘటనే జరగగా సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.వివరాల్లోకి వెళితే, కోల్కతాలో ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద అనే వ్యక్తి నివసిస్తున్నాడు.
ఇతను స్థానిక IIM క్యాంపస్ లో మార్నింగ్ వాక్ కు వెళుతుంటాడు.అలా వెళ్ళేటప్పుడు ఆశ్చర్యకరమైన దృశ్యం అతనికి కనిపించింది.దాంతో అతగాడు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసాడు.

వీడియోని గమనిస్తే, రెండు ఉడుములు మనుషుల్లా నిలబడి ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి.అయితే అవి ప్రేమతో పట్టుకున్నాయా లేక పోట్లాడుకుంటున్నాయో అర్ధం కాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.సుశాంత నంద అనే ట్విట్టర్ అకౌంట్ నుండి పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అవి రెండు అక్కడి ప్రాంతం కోసం పోట్లాడుకుంటున్నాయని ఓ వ్యక్తి కామెంట్ చేయగా మరొక వ్యక్తి ఆడ, మగ ఉడుములు రెండూ ఆటాడుతున్నట్టున్నాయని అన్నాడు.ఇంకొక వ్యక్తి అవి రెండూ ఆడ ఉడుములే, రెండూ పోట్లాడుకుంటున్నాయి, ఉడుం పట్టంటే ఏమాత్రం ఉంటుంది… అని కామెంట్ చేసారు.







