హైదరాబాద్లో విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి.నార్సింగిలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సాత్విక్ ఆత్మహత్యకు కాలేజీ యజమాన్యమే కారణమంటూ స్టూడెంట్స్ యూనియన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఇందులో భాగంగా తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడికి ఎస్ఎఫ్ఐ, ఆప్ నేతలు ప్రయత్నించారు.
అనంతరం బోర్డు కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు బైఠాయించి నిరసనకు దిగాయి.శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థి నేతలను అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.విద్యార్థి సంఘాల నేతల అరెస్టులతో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.