హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ ఆత్మహత్య ఘటనపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విచారణ జరిపింది.డీఐఈఓ ఆధ్వర్యంలో అధికారులు కాలేజీలో విచారణ చేశారు.
విచారణ ఆధారంగా ప్రాథమిక నివేదికను అధికారులు సిద్ధం చేశారు.ఈ మేరకు శ్రీ చైతన్య కాలేజ్ మేనేజ్ మెంట్ కు ఇంటర్ బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు.
కాలేజ్ యాజమాన్యం ఇచ్చే వివరణపై ఫైనల్ రిపోర్ట్ సిద్ధం చేసి అధికారులు కమిషనర్ కు అందించనున్నారు.మరోవైపు సాత్విక్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మురంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
కాలేజీపై సెక్షన్ 305 కింద నమోదు చేసిన పోలీసులు సాత్విక్ సూసైడ్ నోటులో ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు.ఇప్పటికే ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, ఆచార్య, నరేశ్ లను అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలోనే సూసైడ్ నోటులో ఉన్న నలుగురిని ఇవాళ పోలీసులు విచారించనున్నారు.