తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇందులో భాగంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై బీఆర్ఎస్ నేతలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.కేంద్రం వెంటనే స్పందించి సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
పెరిగిన ధరలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వినూత్నంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.