యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లిని అంటే ఊరుకుంటారా.. పోసాని షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన యంగ్ టైగర్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.తారకరత్న చనిపోయిన బాధ నుంచి ఎన్టీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

 Posani Krishna Murali Shocking Comments Goes Viral In Social Media Details Here-TeluguStop.com

తాజాగా పోసాని కృష్ణమురళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.జగన్ పై చేస్తున్న నెగిటివ్ కామెంట్లను, ప్రచారాన్ని వైసీపీ వాళ్లు ఎవ్వరూ అడ్డుకోవాల్సిన అవసరం లేదని ప్రజల మనస్సులో జగన్ ఉన్నంత కాలం జగన్ కు ఏమీ కాదని ఆయన తెలిపారు.

ఈనాడులో సీనియర్ ఎన్టీఆర్ గురించి నంబర్ వన్ మహాబలుడు అని రాశారని ఆ తర్వాత చంద్రబాబు గుద్దితే ఎన్టీఆర్ కింద పడినట్టు వార్తలు ప్రచారం చేశారని పోసాని చెప్పుకొచ్చారు.ఇదే ఈనాడులో ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ చరితాత్ముడు అని కథనం ప్రచారంలోకి వచ్చిందని పోసాని అన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి వయస్సు 70 ఏళ్లు అని ఆమె గురించి ఆమె 30 ఏళ్ల వ్యక్తితో అక్రమ సంబంధం అని ప్రచారం చేశారని సిగ్గుచేటుతో అలా ప్రచారం చేశారని పోసాని తెలిపారు.

రామోజీరావు, రాధాకృష్ణలను తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలని ఆయన కామెంట్లు చేశారు.చంద్రబాబు భార్యను ఏమో అంటే కుటుంబం వచ్చారని ఆయన తెలిపారు.వాళ్ల సైకాలజీ ఇలా ఉందని పోసాని పేర్కొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ మదర్ గురించి తప్పుగా కామెంట్ చేయగలవా? అలా చేస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తారని ఎన్టీఆర్ నంబర్ వన్ అని పోసాని అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వగలడని అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ ను టచ్ చేయరని ఆయన తెలిపారు.లక్ష్మీపార్వతికి ఎవరూ లేరని కామెంట్ చేస్తున్నారని పోసాని చెప్పుకొచ్చారు.ఎథిక్స్ ఉండాలని వాళ్లింట్లో ఆడవాళ్ల గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తే ఊరుకుంటారా అని పోసాని అభిప్రాయం వ్యక్తం చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ తల్లి మహాతల్లి అయినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ భార్య మహాతల్లి కాదా అని పోసాని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube