పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీలీల కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.పవన్ వరుసగా ప్రాజెక్ట్ లను ప్రకటించిన నేపథ్యంలో అటు హరీష్ శంకర్ ఇటు సుజీత్ పవన్ కు జోడీగా శ్రీలీలను తీసుకునే ప్రయత్నం చేస్తుండగా ఈ రెండు ప్రాజెక్ట్ లలో శ్రీలీల ఏ సినిమాకు ఓకే చెబుతుందో చూడాల్సి ఉంది.
అయితే పవన్ వయస్సు 51 సంవత్సరాలు కాగా శ్రీలీల వయస్సు 21 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.

ఈ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 30 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.గతంలో పలువురు స్టార్ హీరోలు సైతం ఇదే విధంగా నటించారని పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు.శ్రీలీలకు లేని బాధ మీకు ఎందుకంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ సైతం తన వయస్సులో సగం ఉన్నవాళ్లతో నటించారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

పవన్ ను కావాలనే ట్రోల్స్ చేస్తే మాత్రం బాగుండదని ఫ్యాన్స్ చెబుతుండటం గమనార్హం.పవన్ వరుస ప్రాజెక్ట్ లలో నటిస్తుండగా ఈ ఏడాదే పవన్ నటించిన ఒకటి లేదా రెండు ప్రాజెక్ట్ లు రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది. హరిహర వీరమల్లు సినిమా మాత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.
ఈ సినిమాపైనే క్రిష్, నిధి అగర్వాల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఈ సినిమా విడుదలైన తర్వాతే కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించాలని వీళ్లు భావిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు విడుదలవుతుందో క్రిష్, నిధి కెరీర్ కు ఎప్పుడు మేలు జరుగుతుందో చూడాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ పారితోషికం ప్రస్తుతం 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.







