మెడికో ప్రీతి మృతి కేసులో నిందితుడిగా ఉన్న సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటకు వచ్చాయి.ఈ క్రమంలో సైఫ్ సెల్ ఫోనులో 17 వాట్సాప్ చాట్స్ ను పోలీసులు పరిశీలించారు.
ఇందులో భాగంగా అనూష, భార్గవి, ఎల్డీడీ తో పాటు నాక్ అవుట్స్ అనే గ్రూప్ చాట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా అనస్థీషియా విభాగంలో ప్రీతి సూపర్ వైజర్ గా సైఫ్ ఉండేవాడని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఓ యాక్సిడెంట్ కేసులో ప్రీతిని సైఫ్ గైడ్ చేశాడని, అప్పుడు ప్రీతి రాసిన ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్టును వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసిన సైఫ్ హేళన చేశాడని తెలిపారు.రిజర్వేషన్ లో ఫ్రీ సీట్ వచ్చిందంటూ అవమానించడంతో ప్రీతి వార్నింగ్ ఇచ్చింది.
ఈ క్రమంలో కోపం పెంచుకున్న సైఫ్ ఆర్ఐసీయూలో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని చెప్పాడు.దీనిపై ప్రీతి గత నెల 21న హెచ్ఓడీకి ఫిర్యాదు చేసింది.
దీంతో స్పందించిన హెచ్ఓడీ ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చారు.ఆ మరుసటి రోజు ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.







