హైదరాబాద్ జీడిమెట్లలో అగ్నిప్రమాదం జరిగింది.అరోరా ఫార్మా స్యూటికల్స్ కంపెనీలో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది.
పేలుడుతో పాటు భారీగా మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారని తెలుస్తోంది.
మరోవైపు పేలుడు శబ్దానికి కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం మృతదేహాలు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.







