ఫహద్ ఫాజిల్. పుష్ప సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.
అంతకుముందు కొన్ని సినిమాలు చేసిన అవి పెద్దగా గుర్తింపుని ఇవ్వలేదు కానీ సుకుమార్ ఫహద్ ని పుష్ప సినిమాకి ఎంచుకోవడం ద్వారా ప్రస్తుతం అందరూ అతనిని గుర్తు పడుతున్నారు.ఇక ఫహద్ ఫాజిల్ కెరియర్ లో చాలా ముచ్చటైన అంశాలు ఉన్నాయి.
అతని గురించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఫహద్ ఫాజిల్ తండ్రి ఫాజిల్ ఒక గొప్ప డైరెక్టర్, మన చిరంజీవి పసివాడు ప్రాణం సినిమాకి కథ అందించింది ఆయనే కావడం విశేషం.
ఫాజిల్ డైరెక్షన్ చేయడంతో పాటు నిర్మాతగా, నటుడిగా , రచయితగా ఎన్నో సినిమాలకు పనిచేసి అనేక అవార్డులను దక్కించుకున్నాడు.

ఇక తన కొడుకైన ఫహద్ ఫాజిల్ ని గొప్ప సినిమాతో లాంచ్ చేయాలని భావించాడు.కానీ ఆయన అనుకున్నట్టుగా జరగలేదు.చాలా గ్రాండ్ గా 2002 లో కయ్యతూమ్ దూరాత్ తన సినిమాతో పరిచయం చేయగా ఈ చిత్రం చాలా పెద్ద ఫ్లాప్ అయింది.
కుష్బూ, నగ్మా, బేబీ షాలిని, మోహన్ లాల్ లాంటి గొప్ప గొప్ప నటులను పరిచయం చేసిన ఫాజిల్ సొంత కొడుకుని సరిగ్గా లాంచ్ చేయలేకపోయాడని అతని ఫెయిల్యూర్ కి ఫాజిల్ కారణమంటూ మీడియా కోడై కూసింది.అయితే తన సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం తన తండ్రి కాదని, కేవలం తనకు నటన రాకపోవడం వల్లే ఇలా జరిగిందని తాను సినిమాకు పనికి రాను అంటూ ఫహద్ ఫాజిల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు.

స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు దాదాపు ఏడేళ్ల పాటు సినిమాల్లో కనిపించకుండా ఉన్నాడు.ఆ తర్వాత యుఎస్ కి వెళ్లిపోయి అక్కడే సెటిల్ అవ్వాలనుకున్నాడు.అయితే 2009 లో మళ్లీ ఒక చిన్న పాత్రతో కేరళ కేఫ్ అనే సినిమాతో రి ఎంట్రీ ఇచ్చాడు.2009 నుంచి 2012 వరకు చిన్న చిన్న సినిమాలు చేస్తూ వచ్చిన ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.2012 లో వచ్చిన 22 ఫిమేల్ కొట్టాయం సినిమా పెద్ద సక్సెస్ కావడంతో ఫహద్ ఫాజిల్ కి మంచి బ్రేక్ లభించింది.ఇక బెంగళూర్ డేస్ అనే సినిమా అయితే ఫాహద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ గా చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత ఆయన ఎన్నో సినిమాల్లో నటించాడు.ఫ్రైడే, డైమండ్ నెక్లెస్, అన్నయూమ్ రసూలమ్, ఆమెన్ సినిమాల్లో అతని నటన మరో లెవల్ అని చెప్పొచ్చు.
ఇక బెంగళూరు డేస్ లో నటించిన తన హీరోయిన్ నజ్రియా నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వీరి నిర్మాణంలో సైతం అనేక సినిమాలు వచ్చి హిట్టవుతున్నాయి.
ప్రస్తుతం ఫహద్ ఫాజిల్ కి మలయాళంలో 100 కోట్లకు పైగానే మార్కెట్ ఉంది.పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగాడు.