ప్రభాస్, అల్లు అర్జున్ చేసిన ఆ రెండు సినిమాలని మిస్ చేసుకున్న తారకరత్న...

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో తారకరత్న ఈయన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.అయితే ఈ సినిమాకంటే ముందే తారక రత్న హీరో గా పరిచయం అవ్వాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.

 Tarakaratna Missed Those Two Movies Of Prabhas And Allu Arjun ,nandamuri Family-TeluguStop.com

అయితే తారక రత్న హీరో గా చేయాల్సిన రెండు సినిమాలు కూడా ప్రస్తుతం టాప్ హీరోలు గా ఉన్న ఇద్దరు హీరోలు చేయడం అనేది నిజంగా యాదృచ్చికం అనే చెప్పాలి.

తారక రత్న మొదట చేయాల్సిన సినిమా ప్రభాస్ హీరోగా వచ్చిన ఈశ్వర్ సినిమా…ఈ స్టోరీ మొదట తారక రత్న తో చేద్దాం అని ఆ సినిమా డైరెక్టర్ అయినా జయంత్ సి పరాన్జీ, ప్రొడ్యూసర్ అయినా అశోక్ కుమార్ ఇద్దరు అనుకున్నారట కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది ప్రభాస్ దగ్గరికి వెళ్ళింది.ఆయన ఈ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు…

 Tarakaratna Missed Those Two Movies Of Prabhas And Allu Arjun ,Nandamuri Family-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా కూడా తారక్ రత్న చేయాలి కానీ అది కూడా మిస్ అయింది అది ఏంటంటే రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన గంగోత్రి సినిమా ఈ సినిమాని తారక రత్న చేయాలి కానీ అల్లు అరవింద్ మధ్యలో ఎంటర్ అయి అల్లు అర్జున్ తో ఈ సినిమా చేసేలా సెట్ చేసారు… మొత్తానికి రెండు హిట్ సినిమాలు చేసే అవకాశాన్ని తారక్ రత్న మిస్ చేసుకున్నారు…తారక రత్న తో చేయాల్సిన సినిమా ఇలా మిస్ అవ్వడం తో రాఘవేంద్ర రావు గారే దగ్గర ఉండి మరి కోందండ రామిరెడ్డి గారితో తారక రత్న సినిమా చేసేలా సెట్ చేసినట్టు తెలుస్తుంది…ఇక ఇది ఇలా ఉంటె రీసెంట్ గానే అనారోగ్య కారణంగా తారక్ రత్న మరణించిన విషయం కూడా మనకు తెలిసిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube