మన టాలీవుడ్ లో యంగ్ హీరోల డెడికేషన్ చూస్తే ఒక్కోసారి ముచ్చట వేస్తూ ఉంటుంది.వారు సినిమా కోసం ఎంత సాహసం అయినా చేయడానికి సిద్ధంగా ఉంటారు.
సినిమా అంటే ఒక పాషన్ తో వచ్చి సినిమానే లోకంగా బ్రతికే నటులు ఎందరో ఉన్నారు.మరి ఇలాంటి టాలెంటెడ్ అండ్ డేడికేటివ్ హీరోల్లో నైట్రో స్టార్ సుధీర్ బాబు కూడా ఉన్నారు.
సుధీర్ బాబు మహేష్ బాబు బావగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఈయన ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో ఆకట్టుకోలేక పోయిన రెండవ సినిమాతోనే మంచి హిట్ అందుకుని హీరో మెటీరియల్ అనిపించాడు.
ఇక ఒక్కో సినిమా చేస్తూ ప్రెజెంట్ తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రజెంట్ సుధీర్ బాబు నటిస్తున్న సినిమాల్లో ”మామ మశ్చీంద్ర” ఒకటి.

ఈ సినిమాను ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి టైటిల్ విషయం లోనే మంచి అంచనాలు క్రియేట్ చేసుకుంది.ఇక తాజాగా సుధీర్ బాబు కు సంబంధించిన పోస్టర్ ఒకటి రిలీజ్ అయ్యింది.ఈ సినిమాలో సుధీర్ పలు గెటప్స్ లో కనిపిస్తుండగా.తాజాగా దుర్గ అనే రోల్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

ఈ పోస్టర్ చూస్తుంటేనే అందరూ షాక్ అవుతున్నారు.ఎందుకంటే సుధీర్ మొదటిసారి ప్రొస్థెటిక్ మ్యాకప్ తో దుర్గ పాత్ర కోసం రెడీ అయ్యాడు.ఈయనను చుసిన గుర్తుపట్టలేనంతగా తనని తాను మార్చుకుని ఈయన డెడికేషన్ ను మరోసారి ప్రూవ్ చేసారు.
ఈ పోస్టర్ ఇప్పుడు ఆసక్తిగా మారింది.దీంతో మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఇక శ్రీ వెంకటేశ్వరా సినిమాస్, ఎల్ ఎల్ పి వారు నిర్మిస్తుండగా.చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.







