తెలుగు ప్రేక్షకులకు మెగా కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అయిన ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఉపాసన ఒకవైపు మెగా కూడలిగా బాధ్యతలను చేపడుతూనే మరొకవైపు అపోలో హాస్పిటల్స్ కి మేనేజర్ గా కూడా బాధ్యతలను నిర్వహిస్తోంది.
అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు ఇస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది.
ఇక సమయం దొరికినప్పుడల్లా తన భర్త అయిన రామ్ చరణ్ తో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఉపాసన.

ఇకపోతే ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.దీంతో ఆ విలువైన సమయాన్ని భర్తతో గడుపుతూ సమయాన్ని ఎంచక్కా ఆస్వాదిస్తుంది.కాగా ఉపాసన ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్ విషయం గురించి డెలివరీ విషయం గురించి వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఉపాసన డెలివరీ ఇండియాలో కాదని విదేశాలలో అంటూ కొన్ని రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇదే విషయంపై ఈ వార్తలపై స్పందించిన ఉపాసన తాను ఇండియాలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు చెప్పేసింది.కాగా రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా ప్రోగ్రాంలో మెడికల్ కరస్పాండెంట్ గైనకాలజిస్ట్ జెన్నీఫర్ ఆస్టన్ తో కలిసి పర్సనల్ విషయాలు చర్చించిన విషయం తెలిసిందే.

ఉపాసన కొద్దిరోజులు అమెరికాలో ఉంటుందని ఆమెకు మీరు అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలని చెర్రీ సూచించగా జన్నీఫర్ ఆ విషయంపై స్పందిస్తూ మీ ఫస్ట్ బేబీని దగ్గర నుండి డెలివరీ చేయడం తనకు ఎంతో గౌరవమని అందుకోసం ఎప్పుడూ ఏ సమయంలో అయినా అందుబాటులో ఉంటాను అనే మాట ఇచ్చారు.ఆ విషయం గురించి ఉపాసన స్పందిస్తూ.డాక్టర్ జెన్నీఫర్ ఆస్టన్ మీరు చాలా స్వీట్.మిమ్మల్ని కలవడానికి ఎదురు చూస్తున్నాను.దయచేసి మీరు మా అపోలో హాస్పిటల్స్ ఫ్యామిలీలో భాగం అవ్వండి.ఇక్కడి వైద్యులు సుమన మనోహర్, రూమా సిన్హా తో కలిసి మా బేబినీ డెలివరీ చేయండి అని రాసుకొచ్చింది.







