టాలీవుడ్ ఇండస్ట్రీలోని అద్భుతమైన నటులలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరనే సంగతి తెలిసిందే.ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ను అయినా అద్భుతంగా పలికించే జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో ఆర్ఆర్ఆర్ ఈవెంట్లకు దూరంగా ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.
తారకరత్న మరణం వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్లకు దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతున్నా వాస్తవాలు మాత్రం వేరే విధంగా ఉన్నాయని తెలుస్తోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక విషయంలో ఎంతగానో హర్ట్ అయ్యారని అందుకే ఆయన ఈ విధంగా చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ నెల 12వ తేదీన ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ మూవీకి ఇప్ప గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ తో పాటు లాస్ ఏంజిల్స్ ఫిల్మ్స్ క్రిటిక్స్ అవార్డ్ తో పాటు హెచ్.సి.ఏ అవార్డులు వచ్చాయి.హాలీవుడ్ సినిమాలను మించి ఈ సినిమా అవార్డులను సొంతం చేసుకోవడం గమనార్హం.
ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజైన సమయంలోనే తారక్ పాత్రకు ప్రాధాన్యత తగ్గిందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.ఆస్కార్ బెస్ట్ యాక్టర్ ఎంట్రీ రేసులో తన పేరు లేకపోవడం తారక్ ను హర్ట్ చేస్తిందని తెలుస్తోంది.

జక్కన్న సైతం బెస్ట్ యాక్టర్ నామినేషన్స్ లో తారక్ ఉంటాడని చెప్పారని కానీ నామినేషన్ దక్కకపోవడంతో తారక్ ఫీలయ్యారని బోగట్టా.ఆస్కార్ రాకపోయినా నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ రాకపోవడం కూడా తారక్ ను ఒకింత బాధ పెట్టిందని సమాచారం అందుతోంది.అయితే ఆస్కార్ అవార్డ్స్ ఫెస్టివల్ లో మాత్రం తారక్ పాల్గొననున్నారని తెలుస్తోంది.తారక్ త్వరలో కొరటాల శివ సినిమాతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.







