మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చివరిగా రిపబ్లిక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పాలి.
ఇక ఈ సినిమా తరువాత సాయి ధరమ్ తేజ్ ఎలాంటి సినిమాలలో నటించలేదు.రిపబ్లిక్ సినిమా విడుదలకు ముందు సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే.
ఈ ప్రమాదం నుంచి ఈయన కోలుకోవడానికి కాస్త సమయం పట్టింది తద్వారా ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు.

ఇకపోతే తాజాగా సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేసారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మార్చి 1వ తేదీ ఈ సినిమా నుంచి టీజర్ విడుదల కావాల్సి ఉండగా ఒకరోజు ముందుగానే ఈ టీజర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చూపించినట్టు తెలుస్తోంది.
ఇక ఈ టీజర్ చూసినటువంటి పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించినట్టు సమాచారం.

ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ పై పెద్ద ఎత్తున ప్రశంసల కురిపించడంతో సాయిధరమ్ తేజ్ సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తన సినిమా కోసం ఇలా వచ్చిన తన మీద ఇంత ప్రేమను కురిపించిన తన మావయ్యకు సాయి ధరంతేజ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది.
ఇకపోతే పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ ఇద్దరు కలిసి మరో సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.తమిళంలో ఎంతో సక్సెస్ అందుకున్నటువంటి వినోదయ సితం సినిమాకు రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు.
మరి కొద్ది రోజులలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.







