టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో వాదనలు జరగనున్నాయి.ఈ మేరకు పట్టాభిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుపరిచాలని న్యాయమూర్తి తెలిపారు.
ఈ క్రమంలోనే రేపు బాధితుడి తరపు వాదనలకు ధర్మాసనం అవకాశం కల్పించింది.రేపు పట్టాభి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ జరుపుతామని జడ్జి వెల్లడించారు.
అయితే ఇటీవల గన్నవరంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తనకు బెయిల్ ఇప్పించాలని కోరుతూ పట్టాభి పిటిషన్ దాఖలు చేశారు.