యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా వరుసగా సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్తుంది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా నటిస్తుంది అనే మంచి పేరును సొంతం చేసుకున్న శృతి హాసన్ తాజాగా తన తీరు కారణంగా విమర్శలు ఎదుర్కొంటోంది.
మొన్న సంక్రాంతి కి వీర సింహా రెడ్డి మరియు వాల్తేరు వీరయ్య సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శృతి హాసన్ రెండు సక్సెస్ లను ఒక్క రోజు తేడాతో సొంతం చేసుకుంది, అయినా కూడా శృతి హాసన్ తెలుగు లో కొత్త సినిమాలకు ఓకే చెప్పక పోవడం ఆశ్చర్యంగా ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా లో శృతి హాసన్ కి వ్యతిరేకంగా కొందరు కామెంట్ చేస్తూ ఉన్నారు.
తెలుగు సినిమాల కంటే కూడా ఎక్కువగా హిందీ సినిమాలు మరియు సిరీస్ ల పైనే ఈమె దృష్టిపెడుతోంది అనేది కొందరి వాదన.మొత్తానికి సోషల్ మీడియా లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా శృతి హాసన్ తెలుగు సినిమాలకు ఓకే చెప్పడం లేదు అనేది బలంగా వాదన వినిపిస్తుంది.ఈ విషయమై శృతి హాసన్ ఎలాంటి స్పందన ఇస్తుంది అనేది చూడాలి.
శృతి హాసన్ కి కమర్షియల్ హీరోయిన్ గా ఇప్పటికే మంచి పేరు వచ్చింది.కనుక ముందు ముందు మరిన్ని సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.కానీ ఆమె మాత్రం సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమా లో నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు.
టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ సినిమాల్లో కూడా శృతి హాసన్ నటించినందుకు నో చెబుతుందని వార్తలు వస్తున్నాయి.ఇంతకు ఆమె ఎందుకు నో చెబుతుంది అనేది తెలియాలంటే ఆమె నోరు విప్పాల్సిందే.