టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.సినిమా విజయం లో ప్రతి ఒక్కరి పాత్ర కీలకం అనడం లో ఎలాంటి సందేహం లేదు.
అయినా కూడా ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా లో రామ్ చరణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.గుడ్ మార్నింగ్ అమెరికా షో లో రామ్ చరణ్ పాల్గొనడం తో పాటు ప్రతిష్టాత్మకమైన అవార్డులను కూడా సొంతంగా అందుకున్నాడు.

అందుకే సినిమా యొక్క మొత్తం క్రెడిట్ రామ్ చరణ్ కే దక్కాలి అంటూ కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.అద్భుతమైన రెస్పాన్స్ రామ్ చరణ్ కి ఇవ్వాలి అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు.బాలీవుడ్ హీరో లకు సైతం సాధ్యం కానీ అరుదైన ప్రశంసలను మరియు అవార్డులను రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు అయినా కూడా టాలీవుడ్ కి చెందిన చాలా మంది ప్రముఖులు కనీసం రెస్పాండ్ కూడా కాలేదని మెగా కాంపౌండ్ కు చెందిన కొందరు విమర్శిస్తున్నారు.

ఆ విమర్శలకు ఈ సమయం లో కొందరు స్పందిస్తూ సినిమా యొక్క క్రెడిట్ కేవలం రామ్ చరణ్ ది మాత్రమే కాదు.చిన్న అవార్డు లభించినా కూడా ప్రతి ఒక్కరికి ఆ ఘనత లభిస్తుంది.కనుక ప్రత్యేకంగా రామ్ చరణ్ ను అభినందించాల్సిన అవసరం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో ఒక వైపు మెగా కాంపౌండ్ మరో వైపు ఇతర హీరోల మధ్య వాడి వేడి గా చర్చ జరుగుతుంది.ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
రామ్ చరణ్ కి ఇండస్ట్రీ వర్గాల నుండి లభించాల్సిన గౌరవం గుర్తింపు దక్కడం లేదని మెగా కాంపౌండ్ వారు ఆరోపిస్తున్న నేపథ్యం లో మీరు ఏమంటారో కామెంట్ రూపం లో చెప్పండి.







