హైదరాబాద్లో సైబర్ మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.టెలిగ్రామ్ యూజర్లకు యువతులను ఎరవేసి ట్రాప్ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు.ఈ క్రమంలో వారం రోజుల్లోనే రూ.2.5 కోట్లకు పైగా దండుకున్నారు.యూట్యూబ్ వీడియోలు, యాడ్స్ క్లిక్ చేస్తే కమీషన్ అంటూ చీటింగ్ కు పాల్పడ్డారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ వ్యాపారిని ట్రాప్ చేసి సైబర్ చీటర్స్ రూ.8 లక్షలు కాజేశారు.రియల్ ఎస్టేట్ వ్యాపారిని ముషీరాబాద్ కు చెందిన వ్యక్తిగా సైబర్ అధికారులు గుర్తించారు.బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







