1.గుజరాత్ లో రెండు చోట్ల భూ ప్రకంపనాలు
గుజరాత్ లోని అంబ్రెల్లీలో ఈరోజు భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి.దీని తీవ్రత 3.8 గా రిక్టర్ స్కేల్ పై నమోదయింది.
2.చంద్రగిరి లో లోకేష్ పాదయాత్ర
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది.ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై లోకేష్ అనేక విమర్శలు చేశారు.
3.ప్రీతి మరణం పై పవన్ కళ్యాణ్ స్పందన
డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు.
4.అయ్యన్నపాత్రుడు పై పోర్జరీ కేసు దర్యాప్తుకు సుప్రీం అనుమతి
టిడిపి నేత అయ్యన్నపాత్రుడు ఫోర్జరీ కేసు దర్యాప్తునకు సుప్రీం కోర్టు అనుమతించింది.
5.డిఎస్ కు తీవ్ర అస్వస్థత
పిసిసి మాజీ చీఫ్ బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు గా కీలక పదవులు చేపట్టిన ధర్మపురి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు.ఈ విషయాన్ని ఆయన కుమారుడు నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ట్వీట్ ద్వారా తెలియజేశారు.
6.మెడికల్ కళాశాల బంద్ కు విద్యార్థి సంఘాల పిలుపు
కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ధారావత్ ప్రీతికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన దిగారు .నేడు తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ కళాశాలలో బంద్ కు ఏబీవీపీ తో పాటు ఓయూ జేఏసీ పిలుపునిచ్చాయి.
7.బండి సంజయ్ కామెంట్స్
కెసిఆర్ పాలనలో ఆడపిల్లల భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
8.సిసోడియా అరెస్టుపై ఆఫ్ నిరసనలు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేడు దేశ వ్యాప్తంగా నిరసన చేపట్టింది.
9.లోకేష్ పాదయాత్ర
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేటికీ 29వ రోజుకు చేరుకుంది.
10.మేఘాలయ నాగాలాండ్ లలో పోలింగ్
మేఘాలయ నాగాలాండ్ సోమవారం ఉదయం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
11.మంత్రి హరీష్ రావు కామెంట్స్
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలపై పొరుగు రాష్ట్రాలు ప్రశంసలు కురిపిస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.
12.నేడు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం
ధరణిలో నెలకొన్న సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు మంత్రి హరీష్ రావు అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ సోమవారం సమావేశం అయింది.
13.సోము వీర్రాజు కామెంట్స్
ఏపీకి చెందిన బిజెపి నేతలు కొంతమంది తనకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారని వస్తున్న వార్తల పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.తన పై ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
14.తెనాలి పర్యటనకు జగన్
ఏపీ సీఎం జగన్ రేపు గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు.
15.నేడు హనుమకొండలో కేటీఆర్ పర్యటన
నేడు హనుమకొండలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు.సోడాషపల్లిలో రైతు వేదికను ఆయన ప్రారంభించారు.అనంతరం మూడు గంటలకు ప్రారంభమైన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు.
16.నేడు పలు ఎంఎంటిఎస్ సర్వీసులు రద్దు
నేడు పలు ఎం ఎం టి ఎస్ సర్వీసులు రద్దయ్యాయి.లింగంపల్లి ,హైదరాబాద్, ఫలక్ నుమా మార్గంలో 19 ఎంఎంటిఎస్ రైళ్ళను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
17.కె.విశ్వనాథ్ సతీమణి మృతి
దివంగత డైరెక్టర్ కె విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూశారు.నేడు పంజాగుట్ట స్మశాన వాటికలో జయలక్ష్మి అంత్యక్రియలు జరగనున్నాయి.
18.యాదాద్రిలో ఏడవ రోజు బ్రహ్మోత్సవాలు
యాదాద్రిలో ఏడో రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.తూర్పు రాజగోపురం మాడవీధుల్లో నేడు స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది.
19.నేడు కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల
నేడు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధులు విడుదలయ్యాయి.16,800 కోట్లను ప్రధాని నరేంద్ర మోది విడుదల చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,350
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 56,020
.