రాధికకు ఆ టాలీవుడ్ హీరో అంటే అంత ఇష్టమా.. ఏకంగా మనవడికి పేరు పెట్టెంత?

సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటి రాధిక గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈమె తమిళ భాషలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా అగ్ర హీరోలు అందరి సరసన నటించి ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Does Radhika Love That Tollywood Hero So Much That Shenamed Her Grandson Radhik-TeluguStop.com

ఈ విధంగా హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన రాధిక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇకపోతే గతంలో అలీతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాధిక తనకు ఇష్టమైన టాలీవుడ్ హీరో గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన న్యూ జనరేషన్ హీరో ఎవరు అని ప్రశ్నించగా ఈమె ఎన్టీఆర్ పేరు చెప్పేశారు.తనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని ఆయనపై ఉన్న ఇష్టం తోనే తన మనవడికి కూడా తారక్ అనే పేరు పెట్టుకున్నామని తెలిపారు.ఇక ఎంతో ఇష్టమైన హీరోని మీరు ఎన్నిసార్లు కలిశారు అంటూ ఆలీ ప్రశ్నించగా తాను ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎన్టీఆర్ ను కలవలేదని తనకు ఎప్పటికైనా తనని కలసి తనతో ఒక సినిమాలో నటించాలన్నదే తన కోరిక అంటూ రాధిక తెలియజేశారు.

తారక్ నటన ఎంతో అద్భుతంగా ఉంటుందని తెరపై ఆయనని చూస్తే అలాగా ఉండిపోతామని తెలిపారు.ఇక తనలో మంచి డాన్సర్ కూడా దాగి ఉన్నారని రాధిక ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించారు.ఇక ఎన్టీఆర్ కి తల్లిగా నటించాలని ఉందా అత్తగా నటించాలని ఉందా అంటూ అలీ ప్రశ్నించగా ఏదో ఒకటి తనకు ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం వస్తే చాలు అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ పై తనకు ఉన్నటువంటి అభిమానం గురించి రాధిక కామెంట్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.facebook.com/reel/2769199879878883?mibextid=6AJuK9
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube