గోపిచంద్ మలినేని కి ఎందుకు తన ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందంటే..?

వీరసింహ రెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ గోపిచంద్ మలినేని గురించి మనందరికీ తెలిసిందే అయితే ఆయన సినిమా ఇండస్ట్రీ కి వచ్చి ఒక 10 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తరువాత డైరెక్టర్ గా మారి రవితేజతో డాన్ శీను అనే సినిమా చేశారు… ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది దాంతో గోపిచంద్ మలినేని ఇండస్ట్రీ లో ఒక మంచి డైరెక్టర్ అని అందరి దృష్టిని తన మీదికి మరల్చుకున్నాడు.ఆ తర్వాత ఆయన రెండో సినిమాగా విక్టరీ వెంకటేష్ హీరోగా బాడీగార్డ్ అనే సినిమా చేశాడు.

 Why Did Director Gopichand Malineni Have To Sell His Property For Movies Details-TeluguStop.com
Telugu Balupu, Krack, Pandagachesko-Movie

ఆ తరువాత బలుపు, పండగచేసుకో, విన్నర్ ఇలా వరుస గా సినిమాలు చేసిన గోపిచంద్ మలినేనికి క్రాక్ సినిమా చేసేదాకా ఏ సినిమా ప్రొడ్యూసర్ కూడా తనకి రెమ్యూనరేషన్ సరిగా ఇవ్వలేదట దాంతో ఆయనకు ఉన్న ఫైనాన్షియల్ ఇబ్బందులని పోగొట్టుకోవడానికి తన సొంత ఆస్తులని అమ్ముకొని మరి తన అప్పులని తీర్చుకున్నారట అలా అప్పుడు చాలా ఇబ్బందులని ఎదురుకున్నాడట ఇక ఇలా ఉంటే కెరియర్ సెట్ అవ్వదు అనుకొని విన్నర్ సినిమా ప్లాప్ తరువాత రియలైజ్ అయి

Telugu Balupu, Krack, Pandagachesko-Movie

క్రాక్ సినిమా స్టోరీ రాసుకొని మరి హిట్ కొట్టాలనే కసితో రవితేజ తో సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.దాంతో బాలయ్య తో సినిమా చేసి సక్సెస్ సాధించాడు ప్రస్తుతం ఒక పెద్ద హీరోతో సినిమా చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది… దానికి సంభందించిన స్టోరీ రాసి తొందరలోనే సినిమా ని సెట్స్ మీదకి తీసుకెళ్ళి అంతే తొందరగా షూట్ చేసి రిలీజ్ చేసి హైట్రిక్ కొట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది…

 Why Did Director Gopichand Malineni Have To Sell His Property For Movies Details-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube