సాధారణంగా కొందరిలో జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది.కానీ కొత్త జుట్టు రాదు.
దీంతో ఒత్తుగా ఉండాల్సిన జుట్టు పలుచగా మారుతుంటుంది.ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.
మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే హెయిర్ మాస్క్ ను వారానికి ఒక్కసారి వేసుకుంటే నెల రోజుల్లోనే కురులు ఒత్తుగా మారతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో ఐదు టేబుల్ స్పూన్లు కడిగిన బియ్యాన్ని వేసి పన్నెండు నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టైనర్ సహాయంతో రైస్ వాటర్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఉసిరికాయ పొడి, రెండు టేబుల్ స్పూన్లు మందారం పువ్వుల పొడి, రెండు టేబుల్ స్పూన్లు మల్లెపూల పొడి వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మరియు సరిపడా రైస్ వాటర్ ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ వేసుకుంటే నెల రోజుల్లోనే పలుచగా ఉన్న కురులు ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతాయి.

పల్చటి జుట్టుతో సతమతం అయ్యే వారికి ఈ హెయిర్ మాస్క్ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.పైగా ఈ హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది.జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.చుండ్రు సమస్య ఉంటే దూరమవుతుంది.మరియు తలలో నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా సైతం ఉంటుంది.కాబట్టి తప్పకుండా ఈ హెయిర్ మాస్క్ ను వేసుకునేందుకు ప్రయత్నించండి.







