ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్ళ సీజన్ నడుస్తోంది.సెలబ్రిటీలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.
ఇటీవల కాలంలో స్వర భాస్కర్, కియారా అద్వానీ, అతియా శెట్టి లాంటి సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.అయితే చాలావరకు లవ్ మ్యారేజ్ లు జరుగుతున్నాయని చెప్పవచ్చు.
అయితే అభిమానులు, నెటిజన్స్ పెళ్లి కంటే వారి వయసు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.అందుకు గల కారణం కూడా లేకపోలేదు.

ఎందుకంటే ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అందరూ కూడా 30,40 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకుంటున్నారు.దాంతో వారి పెళ్లి విషయం గురించి కంటే వారి వయసు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.తాజాగా బుల్లితెర నటుడు 50 ఏళ్ళ వయసులో రెండవ పెళ్లి చేసుకోవడంతో అతనిపై మండిపడుతున్నారు.మరి ఆ నటుడు ఎవరు అన్న విషయానికి వస్తే.అతను మరెవరో కాదు సచిన్ ష్రాఫ్.ప్రముఖ హిందీ సీరియల్ నటుడు అయిన సచిన్ తారక్ మెహతాకా ఉల్టా చష్మా అనే సీరియల్ తో బుల్లితెరపై నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఈ క్రమంలోనే ఇంటీరియర్ డిజైనర్ అయిన చాందినిని ఫిబ్రవరి 25న వివాహం చేసుకున్నాడు.

అత్యంత సన్నిహితులు, బంధు మిత్రుల మధ్య వీరి వివాహ వేడుకు అంగరంగ వైభవంగా జరిగింది.ఈ వేడుకలో బాలీవుడ్ బుల్లితెర నటులు సందడి చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.ఇక సచిన్ ష్రాఫ్ కు ఇది రెండవ మ్యారేజ్.2009లో జుహి పార్మర్ ను పెళ్లి చేసున్న అతడు.2018లో ఆమెకు విడాకులు ఇచ్చాడు.ప్రస్తుతం సచిన్ ష్రాఫ్ చాందినిలా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అ ఆ ఫోటోస్ చూసిన నెటిజన్స్ మండిపడుతున్నారు.50 ఏళ్ళ వయసులో రెండవ పెళ్లి అవసరమా అని మండిపడుతున్నారు.ఇంకొందరు ఈ వయసులో నీకు ఇదేం పని అని తిట్టిపోస్తున్నారు.







