టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన ఆర్జీవీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో చాలా సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.తాజాగా ఆర్జీవీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో తీసిన చెత్త సినిమాల గురించి ప్రస్తావించారు.
రంగీలా మూవీకి సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కు సంబంధం లేదని ఆర్జీవీ అన్నారు.రంగీలా సినిమా సాంగ్స్ ను ఎంజాయ్ చేసిన స్థాయిలో మిగతా సినిమాలకు ఎంజాయ్ చేయలేదని ఆర్జీవీ అన్నారు.
ఆ సినిమాకు ఏఆర్ రెహమాన్ కచ్చితంగా పని చేయాలని నేను అనుకున్నానని ఆర్జీవీ తెలిపారు.నా దృష్టిలో నేను తీసిన చెత్త సినిమా ఏదని అడిగితే అంతం అని చెప్పానని ఆయన కామెంట్లు చేశారు.
అంతం కంటే ఫ్లాపైన సినిమాలు ఉండవచ్చని కొంతమందికి అంతం సినిమా నచ్చి ఉండవచ్చని అయితే నా దృష్టిలో మాత్రం అంతం సినిమానే చెత్త సినిమా అని ఆర్జీవీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రతి సినిమా తీయడానికి నాకు ఒక సౌర్స్ ఆఫ్ మెటీరియల్ ఉంటుందని అంతంలో ఉన్న సౌర్స్ మెటీరియల్ వల్ల నేను తీయాలనుకున్నది తీయలేకపోయానని అందువల్లే ఆ సినిమా నా దృష్టిలో బ్యాడ్ మూవీ అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.రాత్రి సినిమా సౌర్స్ మెటీరియల్ లేని మూవీ అని టేకింగ్ ద్వారా ఆ మూవీ తీశానని ఫ్లాపైనా హిట్టైనా ఆ సినిమా నా దృష్టిలో గ్రేట్ మూవీ అని అనిపించిందని ఆర్జీవీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అంతం మూవీకి ఎక్స్ట్రార్డినరీ సౌర్స్ మెటీరియల్ ఉన్నా ఆ సినిమాకు మాత్రం నేను న్యాయం చేయలేకపోయానని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.అంతం సినిమా నుంచి ఏదైనా మంచి జరిగిందా అంటే ఆ సినిమా వల్లే బాలీవుడ్ లో బిజీ అయ్యానని ఆ సినిమాలో మార్పు చేసి సత్య మూవీ తీశానని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.







