జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు.తనపై ఓ మీడియా ఛానల్ లో వచ్చిన వ్యతిరేక కథనం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించినా, పవన్ స్పందించలేదు.
అలాగే గన్నవరం టిడిపి కార్యాలయాన్ని వైసిపి కార్యకర్తలు కొంతమంది ధ్వంసం చేసిన ఘటన పైన మౌనంగానే ఉన్నారు.రాబోయే ఎన్నికల్లో టిడిపి జనసేన పొత్తు పెట్టుకోబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి.
ఈ తరుణంలో పవన్ ఈ విధంగా మౌనంగా ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది.ఇక బిజెపి విషయానికొస్తే ఆ పార్టీ జనసేనతో పొత్తు కొనసాగిస్తామని, రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయని చెబుతున్నా.
పవన్ మాత్రం టిడిపి తో కలిసి వెళ్ళేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా… టిడిపి, బిజెపిని కూడా కలుపుకు వెళ్లి ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తున్నారు.దీనిలో భాగంగానే ఏపీ అంతటా తన ఎన్నికల ప్రచార వాహనం వారాహి ద్వారా పర్యటించి వైసిపి ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెంచే విధంగా ప్లాన్ చేశారు .అయితే ఇప్పటికే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్రను కొనసాగిస్తున్నారు.దీంతో పవన్ వారాహి యాత్రను వాయిదా వేసుకున్నారని , లోకేష్ యాత్రకు ఇబ్బంది ఏర్పడకుండానే పవన్ సైలెంట్ అయ్యారని వైసీపీ విమర్శలు చేస్తున్నా, జనసేన నుంచి స్పందన కనిపించడం లేదు.అయితే పవన్ సినిమా షెడ్యూల్ కారణంగా తీరిక లేనందునే ఈ యాత్రను వాయిదా వేసుకున్నారట.

సినిమా షెడ్యూల్ ముగిసిన తర్వాత నుంచి యాత్రను చేపట్టాలని, అలాగే ఎన్నికలకు ఆరు నెలలు ముందే కీలకమని అప్పుడు వారాహి ద్వారా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ.యాత్రను కొనసాగిస్తే ప్రజల్లోనూ ఆలోచన రేకెత్తుతుందని, ముందు నుంచి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే వాటిని సరిదిద్దుకుని ప్రజల్లో మరింత బలాన్ని వైసిపి పెంచుకుంటుందని పవన్ అభిప్రాయపడుతున్నారట.ప్రస్తుతం పవన్ రెండు సినిమాలను ఒప్పుకున్నారు.అవి పూర్తి కాగానే పవన్ యాత్ర మొదలయ్యే అవకాశం ఉన్నట్టుగా జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.







