Netflix యూజర్లకు శుభవార్త… ధరలు భారీగా తగ్గాయిగా!

ప్రపంచ OTT దిగ్గజం Netflix తమ యూజర్లకి మరింత చేరువయ్యే విధంగా ప్రణాళికలు వేస్తూ పోతోంది.నేటి వరకూ Netflix మిగతా OTTలు అయినటువంటి Amazon Prime, Disney Plus Hotstar, Sony Live, G5లతో పోలిస్తే.

 Good News For Netflix Users The Prices Have Come Down Heavily-TeluguStop.com

భారీగా ఛార్జెస్ వసూలు చేస్తోందనే విషయం విదితమే.కాగా అదే దాని పాలిట శాపంగా మారింది.

ఫీజుల కారణంగానే.ఇటీవల సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టడంతో నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ఫీజులను తగ్గించింది.

అవును, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో సేవలు అందిస్తున్న నెట్‌ఫ్లిక్స్.తాజాగా 30 దేశాల్లో నెలవారీ చార్జెస్‌ని తగ్గించింది.

Telugu Latest, Netflix, Ups-Latest News - Telugu

ఫీజు తగ్గింపుతో పాటుగా పాస్‌వర్డ్ షేరింగ్ విధానాల్లో కూడా కొన్ని కీలక మార్పులు చేసింది.నెట్‌ఫ్లిక్స్.ఈజిప్ట్, ఒమన్, ఇరాన్, కెన్యా, క్రొయేషియా, జోర్డాన్, లిబియా, స్లోవేనియా, బల్గేరియా, ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్, ఈక్వెడార్, వెనిజులా, ఫిలిప్పీన్స్, బోస్నియా, మాసిడోనియా వంటి దేశాల్లో నెలవారీ రుసుమును తగ్గించింది.అయితే భారత్‌ ఈ లిస్టులో లేకపోవడం కొసమెరుపు.

కాగా నెట్‌ఫ్లిక్స్ గత ఏడాదే భారతదేశంలో నెలవారీ రుసుమును తగ్గించినందున, ఇప్పుడు మళ్ళీ తగ్గించాల్సిన అవసరం లేదని భావిస్తోంది.

Telugu Latest, Netflix, Ups-Latest News - Telugu

భారతదేశంలో ఇంతకుముందు, నలుగురు వ్యక్తుల పరిమితితో HD ప్రీమియం ప్లాన్‌కు నెలవారీ రుసుము రూ.799 గా నిర్ణయించగా దేశంలో సబ్‌స్క్రైబర్లు సంఖ్య భారీగా తగ్గిపోతుండటంతో.గతేడాది ఈ మొత్తాన్ని రూ.649కి తగ్గించింది.ఇక నెట్‌ఫ్లిక్స్ భారతదేశంలో కంటే పాకిస్తాన్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉండడం గమనార్హం.

టర్కీ ప్రజలకు నెట్‌ఫ్లిక్కస్ ధరలు ఇంకా తక్కువకే అందుబాటులో ఉన్నాయి.కాగా సింగపూర్, అమెరికాలో భారీగా ఫీజులను వసూలు చేస్తుంది.అమెరికాలో నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పొందడానికి నెలకు 19.99 డాలర్లు చెల్లించాలి, ఇది భారతీయ కరెన్సీలో రూ.1657.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube