పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్ ఇద్దరు కలిసి చేస్తున్న వినోదయ సీతం రీమేక్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో శ్రీలీల ఛాన్స్ అందుకుందని టాక్.అయితే పెళ్లిసందడితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ధమాకాతో మరో హిట్ అందుకుంది.
వరుసగా సినిమాలు చేస్తున్న శ్రీ లీల పవన్ సినిమాలో సాంగ్ అనేసరికి అటెన్షన్ గ్రాబ్ చేసింది.ఇప్పటికే యూత్ ఆడియన్స్ అంతా ఆమెంటే పడి చస్తుంటే ఇక పవర్ స్టార్ సినిమాలో సాంగ్ అనేసరికి మరింత ఎగ్జైట్ అవుతున్నారు.
అయితే కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్న ఈ టైం లో స్పెషల్ సాంగ్ చేయడం పెద్ద రిస్క్ అని చెప్పొచ్చు.కానీ అక్కడ ఉంది పవర్ స్టార్ కాబట్టి కాదని చెప్పలేని పరిస్థితి.
అందుకే శ్రీ లీల అయిష్టంగా అయినా సరే స్పెషల్ సాంగ్ కి ఒప్పేసుకుందట.అయితే అందుకు తగినట్టుగా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది.ఒక్క సాంగ్ కోసమే అమ్మడు కోటి రూపాయల రెమ్యునరేషన్ అడిగేసిందట.శ్రీలీలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమె అడిగినంత ఇచ్చేందుకు రెడీ అయినట్టు టాక్.
ధమాకా చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లోనే వినోదయ సీతం తెలుగు రీమేక్ వస్తుంది కాబట్టి శ్రీలీలకు మరో లక్కీ ఛాన్స్ వచ్చినట్టే.మరి ఈ సాంగ్ లో శ్రీ లీల ఏ రేంజ్ లో ఊపేస్తుందో చూడాలి.