రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‎మెట్ పీఎస్ వద్ద ఉద్రిక్తత

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.పీఎస్ ఎదుట గిరిజన సంఘాలు ఆందోళన కార్యక్రమం చేపట్టాయి.

 Tension At Ranga Reddy District Abdullahpur Met Ps-TeluguStop.com

ప్రేమ వ్యవహారంలో నవీన్ ను చంపిన హరిహర కృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని నిరసనకు దిగారు.

అయితే మృతుడు నవీన్, హరిహర కృష్ణలు మహాత్మాగాంధీ వర్సిటీలో చదువుతున్న విషయం తెలిసిందే.ఇద్దరూ ఒకే యువతిని ప్రేమించడంతో వివాదం మొదలైంది.

ఈ క్రమంలోనే తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని కోపానికి గురైన హరిహర కృష్ణ పార్టీ చేసుకుందామని పిలిచి నవీన్ ను దారుణంగా హత్య చేశాడు.అనంతరం నవీన్ హత్య విషయాన్ని ప్రియురాలికి మెస్సేజ్ చేసినట్లు తెలుస్తోంది.

అది జోక్ అని భావించిన ప్రియురాలు ఓకే, వెరీగుడ్ బాయ్ అంటూ రిప్లై ఇచ్చిందని సమాచారం.దీంతో ఆమె పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube