అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు.సీబీఐ, ఈడీ రాజకీయ ప్రయోజనాల కోసమేనా? అని ప్రశ్నించారు.
ఎల్ఐసీ పెట్టుబడులు ఆవిరి ఆవుతుంటే మౌనం ఎందుకని కవిత నిలదీశారు.ప్రజల డబ్బులతో కేంద్రం ఆటలు ఆడుతుందా అని ప్రశ్నించారు.పెట్టుబడులు పెట్టిన మధ్య తరగతి ప్రజలకు మోదీ చెప్పే సమాధానమేంటన్నారు.కేంద్రం జేపీసీ వేసుంటే ప్రజలు ఇంత నష్టపోయేవారు కాదని చెప్పారు.
ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరిచి జేపీసీ నియమించాలని కవిత డిమాండ్ చేశారు.