సామాన్యుడి జేబుకు కన్నం పెట్టే కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి... మార్చ్ నెలలో?

నెల మారుతున్నపుడల్లా కొత్త కొత్త రూల్స్ అమలులోకి వస్తాయనే విషయం అందరికీ తెలిసినదే.ఈ క్రమంలో ఈ మార్చిలో కూడా కొన్ని కొత్త రూల్స్ రానున్నాయి.

 New Rules Are Coming To Put An Eye On The Common Man's Pocket In The Month Of Ma-TeluguStop.com

కాగా వాటి వలన మీ జేబుకు బాగా చిల్లులు పడే అవకాశం వుంది.అందులో మొదటిది SBI Credit Card.

SBI క్రెడిట్ కార్డ్ విభాగం కొత్త ఛార్జీలను ప్రకటించింది.కాగా ఈ కొత్త ఛార్జీలు 2023 మార్చి 17 నుంచి అమలులోకి రానున్నాయి.ఇకనుండి SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఎవరైనా అద్దె చెల్లిస్తే రూ.199 + ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుంది.గతంలో ఈ ఛార్జీలు రూ.99 మాత్రమే ఉండడం కొసమెరుపు.

Telugu Bank Loans, Latest, Middle Class, Sbi Credit-Latest News - Telugu

ఈ లిస్టులో 2వది LPG గ్యాస్ సిలిండర్ ధర.ఆయిల్ కంపెనీలు ప్రతీ నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తున్న విషయం విదితమే.విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం కలదు.మూడవది.బ్యాంకు లోన్స్.RBI ఇటీవల రెపో రేట్ 25 బేసిస్ పాయింట్స్ పెంచిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో బ్యాంకులన్నీ వడ్డీ రేట్లను పెంచబోతున్నాయి.మార్చి 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు సామాన్యులకు భారం కానున్నాయి.

Telugu Bank Loans, Latest, Middle Class, Sbi Credit-Latest News - Telugu

ఇకపోతే, ఈ నెలలో కొన్ని మార్పులు చేర్పులు జరగనున్నాయి.సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు EPF ఖాతాదారులు అధిక పెన్షన్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం EPFO కల్పిస్తోంది.తిరుమలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఈ నెలలోనే అమలు చేయనుంది.భారతీయ రైల్వే పలు రైళ్ల టైమ్ టేబుల్‌ విషయంలో కొద్దిగా మార్పులు చేయనుందనే వార్తలు వస్తున్నాయి.

వేసవిని దృష్టిలో పెట్టుకొని కొన్ని రైళ్ల టైమింగ్స్‌ను మార్చవచ్చన్నది తెలుస్తోంది.ఇక అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు 3 కంప్లైంట్ అప్పీలేట్ కమిటీలను ఏర్పాటు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

కాగా అవి మార్చి 1 నుంచి పని చేయనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube