టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ప్రస్తుతం రాజమౌళి పేరు దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా మారు మోగిపోతోంది.బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో మరింత బాపులారిటీని సంపాదించుకోవడం ఆ ఖ్యాతిని మరింత విస్తరించాలని చెప్పవచ్చు.
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయ్యి కొన్ని నెలలు అయినా కూడా ఈ సినిమా మేనియా ఇంకా తగ్గలేదు.అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ అరుదైన ఘనతలను సైతం సొంతం చేసుకుంటోంది.

ఇకపోతే ఇటీవల చెన్నైలో జరిగిన డైరెక్టర్ సమ్మిట్ లో ఎస్ఎస్ రాజమౌళి, మణిరత్నం, సుకుమార్ లాంటి టాప్ తెలుగు దర్శకులు పాల్గొన్నారు.ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు దర్శకుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.ఈ నేపథ్యంలోనే దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తడంతో పాటు తాను రాజమౌళిని చూసి ఎలా ఇన్స్పైర్ అయ్యారు అన్న విషయాన్ని కూడా తెలిపారు.ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ.
మీ అందరికీ తెలుసు.పొన్నియిన్ సెల్వన్ సినిమా తెరకెక్కించడానికి నేను ఎన్నో ఏళ్ళు ఎదురు చూశాను.
అంత పెద్ద సినిమా రూపొందించడానికి నాకు సరైన మార్గం కనిపించలేదు.అప్పుడే బాహుబలి సినిమా వచ్చింది.

అది కూడా రెండు భాగాలుగా వచ్చి ప్రేక్షకులను మెప్పించి మంచి విజయం సొంతం చేసుకుంది.అప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి.పెద్ద సినిమా కథలను ఇలా కూడా చెప్పవచ్చు అని అప్పుడే అనిపించింది.ఒకవేళ బాహుబలి సినిమా రెండు భాగాలుగా రాకపోయి ఉంటే పొన్నియిన్ సెల్వన్ సినిమా సాధ్యం అయ్యేది కాదు అని చెప్పుకొచ్చారు మణిరత్నం.
అప్పుడు మాటలపై స్పందించిన రాజమౌళి సర్ ఇది నాకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అని తెలిపారు.ఇకపోతే దర్శకుడు రాజమౌళి విషయానికి వస్తే.రాజమౌళి తన తదుపరి సినిమాను హీరో మహేష్ బాబుతో తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే కథ మొత్తం సిద్ధం కాగా మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా అయిపోగానే వెంటనే సినిమాను మొదలుపెట్టన్నారు రాజమౌళి.







