వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రీతి కేసులో ఆస్పత్రి సూపరింటెండెంట్ ను సీపీ రంగనాథ్ కలిశారు.అనంతరం వైద్యులను అడిగి ప్రీతి పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈ కేసులో నిందితుడు సైఫ్ ను అరెస్ట్ చేశామని సీపీ రంగనాథ్ తెలిపారు.ప్రీతినే లక్ష్యంగా చేసుకుని సైఫ్ వేధించాడన్నారు.
అందరి ముందూ సైఫ్ అమ్మాయిని అవమానించాడని పేర్కొన్నారు.ఈ క్రమంలో ఏమైనా ఉంటే హెచ్ఓడీకి ఫిర్యాదు చేయాలని ప్రీతి చెప్పిందన్నారు.
అవమానించడం కూడా ర్యాగింగ్ లో భాగమేనని సీపీ వెల్లడించారు.







