3 నిమిషాల్లో ఆ పని చేసి గిన్నీస్ రికార్డ్ సాధించిన అక్షయ్ కుమార్.. ఏం చేశాడంటే?

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు అక్షయ్ కుమార్.

 Akshay Kumar Makes Guinness World Record, Akshay Kumar, Bollywood, Selfi Movie,-TeluguStop.com

ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంత ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు.

బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు అక్షయ్ కుమార్.కాకుండా ఇప్పటివరకు దాదాపుగా వందకు పైగా సినిమాల్లో నటించి అరుదైన గౌరవాన్ని కూడా సొంతం చేసుకున్నారు.

Telugu Akshay Kumar, Bollywood, Guinness, Selfi-Movie

ఇకపోతే అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా కూతురు ట్వింకిల్ ఖన్నాని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది.వీరికి కుమారుడు ఆరవ్, కుమార్తె నేత్ర కూడా ఉన్నారు.ఒకవైపు హీరోగా రాణిస్తూనే మరొకవైపు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు.ఇది ఇలా ఉంటే తాజాగా అక్షయ్ కుమార్ కి సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే అక్షయ్ కుమార్ తన అప్ కమింగ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొని కేవలం మూడు నిమిషాలలో 154 సెల్ఫీలు దిగి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సొంతం చేసుకున్నారు.

Telugu Akshay Kumar, Bollywood, Guinness, Selfi-Movie

అక్షయ్ కుమార్ తాజాగా నటించిన చిత్రం సెల్ఫీ.ఈ సినిమా ప్రమోషన్స్ ని ముంబైలో నిర్వహించారు.ఆ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ కుమార్ తన అభిమానంతో సెల్ఫీలు దిగారు.

ఈ క్రమంలోనే మూడు నిమిషాల వ్యవధిలోని 154 సెల్ఫీలు దిగి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ నీ నెలకొల్పాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియోని చూసిన అభిమానులు అక్షయ్ కుమార్ సెల్ఫీ కింగ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని ఫ్యాన్స్ కి సెల్ఫీలతో ఆనందాన్ని పంచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube