టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ ఇతర భాషల్లో మంచి గుర్తింపు ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.ఈ అమ్మడు ప్రేమ లో ఉన్న విషయం తెలిసిందే.
గత కొంత కాలంగా ఏ ప్రత్యేక కార్యక్రమానికి వెళ్ళినా కూడా ప్రియుడి తో కలిసి రకుల్ వెళ్తోంది.అన్ని వర్గాల వారిని కూడా ఈ జంట కన్నుల విందు చేస్తూ ఉంది.
ఇటీవల ఒక ఈవెంట్ లో సందడి చేసిన రకుల్ ప్రీత్ సింగ్ జోడి గురించి మీడియా లో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ముంబైలో ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం సాగిస్తున్నారని తెలుస్తోంది.
త్వరలో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం తో ఇద్దరు కలిసే ఉంటున్నారని కూడా ప్రచారం జరుగుతుంది.

గతంలో రకుల్ ప్రీత్ సింగ్ కి మంచి సినిమాల్లో నటించిన అనుభవం ఉంది.ఈ మధ్య కాలం లో టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో కొనసాగుతూ ఉన్నా కూడా ఎక్కువగా అవకాశాలు రావడం లేదు.బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసిన రకుల్ కి ఇప్పుడు అక్కడ కూడా సక్సెస్ లేదు, ఆఫర్లు లేవు.
అక్కడ ఇక్కడ ప్రస్తుతానికి పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో ఈ సంవత్సరంలోనే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలు ఎక్కే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.అవకాశాలు లేక పెళ్లికి సిద్ధం అవ్వబోతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే.
మరికొన్నాళ్ల పాటు రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నించే అవకాశం ఉందని, వెబ్ సిరీస్ లో అయినా ఈ అమ్మడు నటించేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తుంది.అదే నిజమైతే పెళ్లి ని సంవత్సరం లేదా రెండు సంవత్సరాల పాటు వాయిదా వేసే అవకాశం ఉంది.
పెళ్లి విషయమై క్లారిటీ ఇవ్వని రకుల్ ప్రీత్ సింగ్ తన సహజీవనం గురించి వస్తున్న వార్తల పట్ల ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.సహజీవనం అనేది ఈ మధ్య కాలంలో కామన్ విషయమైంది.
కనుక రకుల్ ప్రీత్ సింగ్ ప్రియుడితో సహజీవనం లో ఉంటే తప్పేంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు.







