ఇటీవలే కాలంలో సైబర్ కేటుగాళ్ల దోపిడికి అడ్డు అదుపు లేకుండా పోయింది.దీనిపై ఎంత అవగాహన కల్పిస్తున్న కూడా క్రమంగా సైబర్ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి.
తద్వారా ఎప్పుడు మొబైల్ హ్యాక్ అయి, బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుందనే ఆందోళన చాలామందిలో ఉంది.సైబర్ కేటుగాళ్ల నుండి తప్పించుకోవడానికి ఎన్నిసార్లు పాస్వర్డ్ లు మార్చిన, ఎంత బలమైన పాస్వర్డ్ సెట్ చేసుకున్న హ్యాకర్ల చేతిలో బలి అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది.
కేవలం ఒక పాస్వర్డ్ సెట్ చేసి వదిలేస్తే చాలా సులభంగా హ్యాక్ చేయబడుతుంది.

పాస్వర్డ్ తో పాటు బలమైన ఆన్లైన్ సెక్యూరిటీ అందించే టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ తో ఇకనుంచి బ్యాంక్ అకౌంట్స్ సేఫ్.ఇక సైబర్ కేటుగాళ్లు అటాక్ చేయడం చాలా కష్టం.టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎనేబుల్ చేసిన డిజిటల్ అకౌంట్ కు ఎవరైనా లాగిన్ అయినప్పుడు వన్ టైం పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్ కు ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది.
మొబైల్ కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తేనే అకౌంట్ యాక్సెస్ అవుతుంది.

ఆ నెంబర్ ఇతరులకు ఇవ్వరు కాబట్టి హ్యాక్ అయ్యే అవకాశం ఉండదు.ఇంకా అకౌంట్ యాక్సెస్ కావడానికి ఫింగర్ ప్రింట్ ఐడి లేదా ఫేస్ ఐడి సెట్ చేసుకోవడం వల్ల మీ మొబైల్ ఫోన్ ఇతరులు హ్యాక్ చేయడం చాలా కష్టం.ఎందుకంటే హ్యాక్ చేయాలనుకునేవారు మీకు వచ్చిన ఓటీపీ లేకుండా మీ అకౌంట్ కు లాగిన్ కాలేరు.
ఫేస్బుక్, వాట్సప్, మైక్రోసాఫ్ట్ లాంటి అకౌంట్లను ఇది సురక్షితంగా ఉంచుతుంది.ఈ ఎక్స్ట్రా లేయర్ సెక్యూరిటీ ఆన్ చేస్తే సైబర్ దాడులను ఎదుర్కోవచ్చు.కావాలంటే ఈ సెక్యూరిటీని టర్న్ ఆఫ్ కూడా చేయవచ్చు.







