ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన ఆర్ పి పట్నాయక్ ప్రస్తుతం ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్నాడు.నీ కోసం సినిమా తో మొదలయిన ఆర్ పి పట్నాయక్ సినిమా ప్రయాణం ఒక్క సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా, దర్శకుడి గా, సింగర్ గా ఎన్నో మలుపులు తిరిగి ప్రస్తుతం ఆగిపోయి ఉంది.
తెలుగు తో పాటు, కన్నడ, హిందీ లో కూడా సినిమాలకు ఆర్ పి పట్నాయక్ సంగీతం అందించారు.ఎంతో మంది సింగర్స్ ని తన సినిమాల ద్వారా సినిమా ప్రపంచానికి పరిచయం చేసాడు.
ఆర్పీ చివరగా 2016 లో తానే నటిస్తూ దర్శకుడిగా చేసిన సినిమా మనలో ఒక్కడు. ఈ సినిమా తర్వాత ఆర్పీ ఎక్కడ మళ్లీ కనిపించలేదు.కెరీర్ తొలినాళ్లలో డైరెక్టర్ తేజ ఆర్పీ ని బాగా ఎంకరేజ్ చేసేవారు.కారణాలు ఏంటో కానీ అయన ఇలా ఇండస్ట్రీ కి దూరంగా ఉండటం మాత్రం చాల మందికి ఎన్నో సందేహాలను సృష్టించింది.ఇక ఈ విషయం పై ఆర్పీ ఎప్పుడు తన మనోభావాలను పంచుకోలేదు కానీ ఆర్పీ తో పాటు చాల రోజులు కెరీర్ తొలినాళ్లలో రూమ్ షేర్ చేసుకున్న నటుడు జెమినీ సురేష్ మాత్రం

ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని విషయాలను బయట పెట్టాడు.ఆర్పీ గారికి సమాజానికి ఎదో చేయాలనే తపన ఎప్పుడు ఉంటుందని అందుకు సినిమానే ఒక మాధ్యమం గా అనుకుంటారని అందుకే సంగీతం వదిలి పెట్టి డైరెక్షన్ చేయడం మొదలు పెట్టారు.అంతే కానీ కేవలం చాల మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఉన్నట్టుగా ఎదో కమర్షియల్ సినిమాలు చేసి డబ్బు పోగేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు అని

అందుకే సంగీతం మొత్తం పక్కన పెట్టి సమాజానికి పనికి వచ్చే సినిమాలు తీసాడని, ముందు ముందు మంచి సినిమాలు తీస్తాడు అని తెలిపారు.ఇక నేను ఎక్కువ రోజులు ఆర్పీ పట్నాయక్ తో ఉండలేదు కానీ సునీల్, త్రివిక్రమ్ తో ఏళ్ళకు ఏళ్ళు ఒకే గదిలో ఉన్నారని, చాల మందిలో లేని ట్యాలెంట్ ఆర్పీ సొంతమని, అంతే కాదు ఎదో ఒక రోజు గొప్ప డైరెక్టర్ గా ఆర్పీ ని చూస్తామని తెలిపారు జెమినీ సురేష్.
.






