సంయుక్త మీనన్. ఇటీవల కాలంలో ఈ అమ్మడి పేరు మారుమోగి పోతుంది.
మలయాళంలో వరుస సినిమాలు చేసి అక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.ఇక మలయాళంలో నటిస్తూనే తమిళ్, తెలుగు భాషలపై ఫోకస్ పెట్టింది.
ఈ క్రమంలోనే తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.రానా సరసన నటించి మెప్పించిన సంయుక్త మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది.
ఇక ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమాలో కూడా నటించింది.వరుసగా రెండు హిట్స్ అందుకుని తెలుగు ప్రేక్షకుల కళ్ళలో పడింది.ఇక ఈ మధ్యనే ధనుష్ తో ‘సార్’ సినిమాలో నటించింది.ఈ సినిమా రిజల్ట్ గురించి చెప్పాల్సిన పని లేదు.
సార్ సూపర్ హిట్ అవ్వడంతో ఈమె పేరు ఇప్పుడు మార్మోగి పోతుంది.ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇలా వరుసగామూడు సినిమాలతో హిట్స్ అందుకుని ఈమె ఉంటే సినిమా హిట్ అనే టాక్ వచ్చింది.ఇక ఈమె ఇప్పుడు స్టార్ హీరోల దృష్టిలో కూడా పడిందట.ప్రెజెంట్ సంయుక్త సితార బ్యానర్ లోనే మరో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చినట్టు టాక్.మరి సితార బ్యానర్ వారు త్వరలోనే స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నారు అని ఈ సినిమాలో ఈమెనే హీరోయిన్ గా తీసుకో బోతున్నారు అని టాక్.
మరి ఎలాగూ అమ్మడి ఖాతాలో మూడు హిట్ సినిమాలు ఉన్నాయి కాబట్టి తన డిమాండ్ ను బట్టి ఈమె రెమ్యునరేషన్ ను పెంచాలని డిసైడ్ అయ్యిందట.ఇక సార్ సినిమాతో సంయుక్త తెలుగుతో పాటు తమిళ్ ఆడియెన్స్ ను కూడా అలరించడంతో ఈమెకు అక్కడ కూడా వరుస ఆఫర్స్ వస్తున్నట్టు తెలుస్తుంది.దీంతో సంయుక్తకు ఏ విధంగా చుసిన ఆఫర్స్ వెల్లువ వస్తుందని సమాచారం.